కత్తి పట్టుకున్న యువకుడి ఫోటో.. విజయవాడలో కలకలం

ఓ యువకుడు కత్తిని షర్టులో పెట్టుకుని బైక్‌పై వెళ్తున్న ఫోటో విజయవాడలో సంచలనంగా మారింది. కానూరు ప్రాంతంలో కెమెరాకు చిక్కిన ఈ ఫోటో నగర వాసుల్లో భయాందోళనలు రేపింది. మళ్లీ నగరంలో రౌడీయిజం మొదలైందా అన్న అనుమానాలు రేకెత్తించింది. అయితే ఈ ఘటనపై వేగంగా స్పందించిన పోలీసులు.. బైక్‌ నెంబర్‌ ఆధారంగా ఆ యువకుడు షేక్‌ ఫయాజ్‌గా గుర్తించారు. అతనితో పాటు అతని స్నేహితుణ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మేకలకు గడ్డి కోయడానికే కత్తిని పట్టుకెళ్లినట్లు ఫయాజ్‌ చెప్పగా.. పోలీసులు పూర్తి విచారణ జరిపి.. యువకుడు చెప్పింది నిజమేనని గుర్తించారు. అయితే బహిరంగంగా ఇలా ప్రవర్తించడం తప్పని.. మరోసారి ఇలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవంటూ యువకులకు గట్టిగా వార్నింగ్‌ ఇచ్చి పంపించారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

అన్న పోలీసు.. చెల్లి మావోయిస్టు.. ఒకరిపై ఒకరు..

Sat Aug 10 , 2019
ఒకే తల్లి బిడ్డలు.. దారులు వేరు.. చెల్లి అడవి బాట పట్టి తుపాకులు చేతబట్టింది. అన్న అడవి బిడ్డలపై తుపాకీ ఎక్కుపెట్టే పోలీస్ ఉద్యోగం. ఎవరి సిద్దాంతాలు వారివి. అయినా రక్త సంబంధం ఆ అన్నను ఆలోచింపజేసింది. చెల్లి మాత్రం కన్నీటిని కనుకొనల్లునే దాచుకుని అన్నపై గుళ్ల వర్షం కురిపించింది. చత్తీస్‌ఘడ్‌కు చెందిన కమాండర్ వెట్టి రామ ఆధ్వర్యంలో జులై 29న 140 మంది పోలీసులు సుక్మా జిల్లాలోని బలేంగ్తాన్‌లో […]