మీ సంగతి తేలుస్తానంటూ పోలీసులతో కానిస్టేబుల్‌ గొడవ

విజయవాడ సింగ్‌నగర్‌ పీఎస్‌ పోలీసులతో అగిరిపల్లి పీఎస్‌ కానిస్టేబుల్ పరుశురామ్‌ గొడవకు దిగాడు. రాత్రి ఇంటికి వెళ్తున్న క్రమంలో మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపాడు పరుశురాం. దీంతో.. కారు ఆపి కానిస్టేబుల్‌ పరుశురాంను ప్రశ్నించాడు ఓ యువకుడు. తనను ప్రశ్నించిన ఆ యువకుడి పట్ల దురుసుగా ప్రవర్తించడంతో.. అతను పరుశురాంపై సింగ్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ కేసులో.. సింగ్‌నగర్‌ పోలీసులు పరుశురాంను స్టేషన్‌ను పిలిచారు. దీంతో రెచ్చిపోయిన పరుశురాం.. మీ సంగతి తేలుస్తానంటూ.. సింగ్‌నగర్‌ ఎస్సై, కానిస్టేబుల్‌ను ఇష్టమొచ్చినట్లు తిట్టాడు. ఏసీపీని సైతం లెక్కచేయకపోవడంతో ఈ పంచాయితీ జిల్లా ఎస్పీ వద్దకు చేరింది. దీనిపై సమగ్ర నివేదిక తీసుకున్న కృష్ణాజిల్లా ఎస్పీ రవీంద్రబాబు.. అగిరిపల్లి కానిస్టెబుల్‌ పరుశురాంను సస్పెండ్‌ చేశారు.

TV5 News

Next Post

టమోటా రైతుల కష్టాలు.. రోడ్లపై పడేసే పరిస్థితి!

Sun Oct 20 , 2019
కర్నూలు జిల్లా టమోటా రైతులు కష్టాలు మాటల్లో చెప్పలేనివిగా ఉన్నాయి. గిట్టుబాటు ధరల్లేక రోడ్లపై పడేసే పరిస్థితి నెలకొంది. వారం రోజులుగా చాలా మంది టమోటా రైతులు పత్తికొండ మార్కెట్‌లో ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారులంతా కుమ్మక్కై గిట్టుబాటు ధర రాకుండా చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు సిండికేట్‌గా మారుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తమ నుంచి తక్కువకు కొని… అధిక లాభాలు గడిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. […]