చాకచక్యంగా చిన్నారిని పట్టుకున్న పదిహేడేళ్ల టీనేజర్.. వీడియో

టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఓ రెండేళ్ల చిన్నారి పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఓ యువకుడు చాకచక్యంగా వ్యవహరించడంతో ఆ పాప ప్రాణాలతో బయట పడింది. ఆ చిన్నారి ప్రమాదవశాత్తూ రెండో అంతస్తు నుంచి జారి పడింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ పదిహేడేళ్ల టీనేజర్ ఆ విషయం గమనించాడు. వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రియాక్టైన ఆ టీనేజర్, చాకచక్యంగా ఆ చిన్నారిని పట్టుకున్నాడు. రెండు చేతులతో పాపను బలంగా పట్టుకోవడంతో ఆమె బతికిపోయింది. టీనే జర్‌ సమయస్ఫూర్తిని నెటిజన్లు తెగ మెచ్చుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *