అవును.. వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారు

అవును.. వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారు

వారి ప్రేమ సమాజంలోని సరిహద్ధులను చెరిపేసింది. కొందరు మనుషులు గీసిన అడ్డుగీతను మాయం చేసింది. మతం అడ్డును తొలగించింది. వివాహ బంధంలో ఉన్న మూస ఆచారానికి తెర దించింది. ఇలాంటి అసమానతలను దాటుకుని ఆ జంట ఒక్కటైంది. అయితే వారు పెద్దలను ఎదిరించి ఒక్కటైన అమ్మాయి, అబ్బాయి అనుకుంటే మాత్రం పొరపాటే. కేవలం అమ్మాయి, అబ్బాయిల మధ్యనే ప్రేమ పుట్టదు. అమ్మాయిలు కూడా ప్రేమించుకోవచ్చు వారు వివాహ బంధంతో ఒక్కటవచ్చని నిరుపించారు బియాంకా మైలీ, సైమాను అనే యువతులు.

మానవీయతపై అమానవీయపు ఆలోచనతో ఉన్న ఈ వ్యవస్థ హద్దులను చెరిపేస్తూ వాళ్ళకు వాళ్ళుగా ప్రేమలో పడి వివాహ బంధంతో ఒక్కటవుతున్నారు అమ్మాయిలు. ఇలాంటి వివాహాలు ఈ మధ్య కాలంలో తరచుగా వింటూనే ఉన్నాం. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో ఇద్దరు యువతులు చేరారు. వీరిలో ఒకరిది పాకిస్థాన్ అయితే మరొకరిది ఇండియా కావడం విశేషం. భారత్‌కు చెందిన బియాంకా, పాక్‌కు చెందిన సైమా.. కాలిఫోర్నియాలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఓ కార్యక్రమంలో కొలంబియన్‌-ఇండియన్‌ బియాంకా మైలీ.. పాకిస్తాన్‌‌కు చెందిన సైమాను కలుసుకుంది. వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. చివరకు జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. కుటుంబం, బంధువులు, స్నేహితుల మధ్య అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు "నీ ప్రేమ నా జీవితాన్ని మరింత సంతోషంగా మార్చేసింది" అంటూ పెళ్ళి ఫోటోలను బియాంక తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ గా మారాయి.

Tags

Read MoreRead Less
Next Story