అనుమానంతో భార్యను కాళ్లతో తొక్కి కడతేర్చిన భర్త

అనుమానం ఓ వివాహిత పాలిట శాపమైంది. తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానం పెంచుకున్న భర్త.. నిత్యం భార్యను వేధించేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవ కాస్తా భార్య హత్యకు దారి తీసింది. కోపంతో భార్యను కడతేర్చాడు భర్త. ఈ ఘటన విశాఖ శివారు ప్రాంతం మధురవాడలో జరిగింది.

విశాఖ మధురావాడ శివశక్తినగర్‌లో సింహాచలం, పద్మ దంపతులు నివాసం ఉంటున్నారు. కొన్నాళ్లుగా వీరి కాపురం సజావుగా సాగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఉన్నట్టుండి భర్త సింహాచలం భార్యపై అనుమానం పెంచుకున్నాడు. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో రోజు వేధించేవాడు. గత కొన్నాళ్లుగా దంపతులు గొడవ పడుతన్నారు. గతంలో కూడా గొడవల వ్యవహారంలో ఇద్దరికి పోలీసులు కౌన్సిలింగ్‌ కూడా ఇచ్చారు. అయినా భర్త తీరు మారలేదు. గత అర్థరాత్రి ఇద్దరి మధ్య గొడవ జరగడంతో కోపం పెంచుకున్న భర్త సింహాచలం…భార్యను కాళ్లతో తొక్కి హతమార్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తమ కూతురిని అనుమానంతో సింహాచలం నిత్యం వేధించేవాడని.. అన్యాయంగా చంపేశాడని మృతురాలి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. నిందితున్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

ఖమ్మం జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం

Fri Jul 12 , 2019
ఇన్‌ఫార్మర్‌ నెపంతో ఖమ్మం జిల్లాలో ఎంపీటీసీని మావోయిస్టులు హత్య చేశారు. చర్లకు చెందిన నల్లూరు శ్రీనివాసరావును మావోయిస్టులు ఈ నెల 8 వ తేదీన కిడ్నాప్‌ చేశారు. నాలుగు రోజుల తర్వాత తెలంగాణ – చత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని ఎర్రంపాటు, పొట్టెపాడు గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో ఆయన మృతదేహం లభ్యమైంది. మృతదేహం దగ్గర మావోయిస్టుల పేరుతో ఓ లేఖ కూడా ఉంది.