కరెంట్ షాక్‌తో చికెన్ సెంటర్‌ నిర్వాహకులైన మామా అల్లుళ్లు మృతి

వాళ్లిద్దరూ మామా అల్లుళ్లు. రోజు కలిసిమెలిసి చిన్న చికెన్ సెంటర్‌ను నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆ క్రమంలో ఆదివారం కూడా చికెన్‌ సెంటర్‌‌కు వెళ్లారు. అక్కడ జరిగిన కరెంట్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో విగతజీవులయ్యారు. ఈ ఘటన విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జరిగింది.

ఆదివారం కావడంతో వ్యాపారం ఎక్కువగా ఉంటుందని ఉదయమే షేక్‌ బాషా, షేక్ సైదులు చికెన్ సెంటర్‌కు వెళ్లారు. కోళ్ల వెంట్రుకలు తీయడానికి ఉపయోగించే ఎలక్ట్రిక్‌ మిషన్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ఇద్దరూ అక్కడే మృత్యువాతపడ్డారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరూ ఒకేసారి చనిపోవడంతో అందరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆప్తుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

TV5 News

Next Post

డిగ్రీ అర్హతతో సుప్రీం కోర్టులో ఉద్యోగాలు.. అప్లైకి ఆఖరు ఈనెల..

Mon Oct 21 , 2019
భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ (SPA), పర్సనల్ అసిస్టెంట్ (PA) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. SPA పోస్టుకు కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. PA పోస్టుకు అనుభవం అవసరం లేదు. సుప్రీం కోర్టు అధికారిక వెబ్‌సైట్ sci.gov.in లో నోటిఫికేషన్ వివరాలు చూడొచ్చు. దరఖాస్తుకు ఆఖరు తేదీ అక్టోబర్ 24. మొత్తం పోస్టులు :58 అర్హత: ఏదైనా డిగ్రీ పూర్తి చేసి […]