అరటిపండు తింటే అబ్బాయి పుడతాడా.. అందులో నిజమెంత

Read Time:0 Second

సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందినా.. ప్రతిదానికి డాక్టర్ దగ్గరకే పరిగెట్టడం కరెక్టే అనుకున్నా.. కొన్ని విషయాల్లో బామ్మలు చెప్పిందే రైటు అంటున్నారు డాక్టర్లు సైతం. 21వ శతాబ్దంలో అడుగుపెట్టినా నానమ్మ చెప్పిన నాటు వైద్యానికే ఓటు వేస్తుంటారు సాప్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్న మనవడు, మనవరాలు. పెద్దలు చెప్పే కొన్ని జాగ్రత్తలు ఆధునిక పోకడలు ఎన్ని ఒంటబట్టించుకున్నా ఆచరించక తప్పదు. అందుకే పెద్దల మాట చద్దిమూట అంటారు.

ఇంట్లో ఆడపిల్ల గర్భంతో ఉంటే ఎన్నో జాగ్రత్తలు చెబుతుంటారు పెద్దవాళ్లు. పుట్టబోయేది ఆడపిల్లో, మగపిల్లాడో కూడా అమ్మమ్మ ఇట్టే చెప్పేస్తుంది. వారి అంచనాలు చాలా వరకు నిజమే అవుతుంటాయి. గర్భం ధరించిన తొలి రోజుల్లోనే ఇరుగు పొరుగు అందరికీ టాంటాం చేయకండి అంటారు. ఎందుకంటే.. నాలుగైదు నెలలు గడిస్తే కానీ గర్భం నిలిచేది లేనిది తెలుస్తుంది.

అరటిపండు తింటే అబ్బాయి పుడతాడని అంటారు. మరి అందులో నిజమెంత అని అంటే.. అరటిపండులో ఉండే పొటాషియం, ఇతర పోషకాలు హార్మోన్ల స్థితిని మార్చడానికి దోహదం చేస్తాయి. ఇలా మారడం వల్ల అబ్బాయి పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అనేక పరిశోధనల్లో కూడా వెల్లడైంది. సరే అమ్మాయో, అబ్బాయో ఎవరో ఒకరు పుట్టినా అరటి పండు తినడం వల్ల అయితే నష్టం ఏమీ లేదు. అరటి పండు ఆరోగ్యానికి మంచిది కూడా.

కడుపులో ఉన్నది ఆడపిల్ల అయితే త్వరగా బయటకు వస్తుందంటారు. అదే మగపిల్లలు అయితే చాలా సేపు పెయిన్ భరించాల్సి వస్తుందట. అందుకే ఓ సామెతను అమ్మమ్మలు అంటూ ఉంటారు.. ఆడపిల్ల పుట్టిన తరువాత ఏడిపిస్తే.. అబ్బాయిలు పుట్టకముందు నుంచే ఏడిపిస్తారని.. ఎవరు పుట్టినా అమ్మకి ప్రసవ వేదన మాత్రం తప్పదు. బిడ్డ పుట్టడం అంటే అమ్మ మరో జన్మ ఎత్తడమే.

అమ్మాయికి పెరుగుతున్న పొట్టను చూసి అత్తమ్మ చెప్పేస్తుంది ఆడపిల్లో, మగపిల్లాడో.. అదెలా అంటే.. పొట్ట కిందకి ఉంటే మగపిల్లవాడని, పైకి ఉంటే ఆడపిల్ల అని చెప్పేవారు. కానీ ఇది నిజం కాదంటారు డాక్టర్లు. పొట్ట స్త్రీ ఆకృతి మీద ఆధారపడి ఉంటుంది తప్ప లోపల ఉన్న బిడ్డను అనుసరించి కాదని అంటున్నారు. ఇక పాలల్లో కుంకుమ పువ్వు వేసుకుని తాగితే పుట్టబోయే బిడ్డ మంచి రంగుతో ఉంటుందని.. అయితే ఇది శాస్త్రీయంగా రుజువు కాలేదు కానీ ఇలా తాగితే తల్లీ, బిడ్డ ఆరోగ్యానికి మంచిది అని అంటున్నారు డాక్టర్లు.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close