వధువు కావాలంటూ టీచర్ ప్రకటన.. ఆయన కోరిక చూస్తే..

అమ్మాయి అందంగా ఉంటే చాలు.. ఆస్తి పాస్తులు అక్కర్లేదు. అనే వాళ్లని చూశాము. కాస్త వంటా వార్పు వచ్చి వుండి మాకో ముద్ద పెట్టి.. అబ్బాయిని బాగా చూసుకుంటే చాలు అనే అత్తమామల్ని చూశాము. కానీ ఇవేవీ కాదు. నాకు మాత్రం అమ్మాయి కావాలి. అలాంటి ఇలాంటి అమ్మాయి కాదు.. చాలా చిన్న కోరిక. జస్ట్ 10 కోట్ల రూపాయలు ఆమె పేరు మీద ఆస్తి ఉంటే చాలు అంటూ ఓ టీచర్ వినూత్నంగా పెళ్లి ప్రకటన ఇచ్చాడు. పెళ్లి కాని ఈ ప్రసాదు ఇచ్చిన ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పశ్చిమ బెంగాల్‌కి చెందిన ఓ టీచర్ పేపర్‌లో ప్రకటన ఇచ్చాడు. ప్రేమలు, పెళ్లిళ్లన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్న ఈ కాలంలో ఇలా వధువు కోసం పేపర్ ప్రకటన ఇవ్వడం కాస్త వింతగా అనిపించింది చూసిన వారికి. తాను తల్లిదండ్రులకి ఒక్కగానొక్క కొడుకునని, సిలిగుడిలోని కాలియాగంజ్‌లో నివాసం ఉంటున్నానని చెప్పాడు. ఆసక్తి గల వారికంటే ఆస్తి ఉన్న వాళ్లకే నా మొదటి ప్రాధాన్యత. అలాంటి వారు ఎవరైనా ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి అంటూ ప్రకటనలో వివరించాడు. ఇంతకీ ఈ యాడ్ ఇచ్చిన ఆ మాస్టారు ఎవరో తెలుసుకోవాలని నెటిజన్స్‌లో ఆసక్తి పెరిగింది. స్థానిక ఉపాధ్యాయ సంఘం నేతలు యాడ్ ఇచ్చిన టీచర్ ఎవరా అని ఆరా తీస్తున్నారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా ఆ నిధి ఇస్తాం : సీఎం జగన్

Thu Jul 11 , 2019
రైతుల్ని ఆదుకునేందుకు 2 వేల కోట్లతో విపత్తుసహాయ నిధిని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు ఏపీ సీఎం జగన్. ఈ బడ్జెట్ లోనే కేటాయింపులు చేస్తామన్నారు. రాష్ట్రంలో నెలకొన్న నీటి ఎద్దడి, వర్షాభావ పరిస్థితులు, రైతుల కష్టాలపై జగన్ అసెంబ్లీలో ప్రకటన చేశారు.. గత ప్రభుత్వ హయాంలో రైతులను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని విమర్శించారు జగన్. ప్రస్తుత విత్తన కష్టాలకు కూడా టీడీపీ ప్రభుత్వ నిర్లక్షమే కారణమన్నారు…తమ ప్రభుత్వం వచ్చిన […]