డ్యాన్స్‌తో దుమ్మురేపిన మహిళా ఎంపీలు..

పశ్చిమ బెంగాల్ కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన మిమి చక్రవర్తి, నుస్రత్ జహాన్‌లు డ్యాన్స్‌ ఇరగదీశారు. వారి స్టెప్పులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దేశవ్యాప్తంగా వచ్చే నెలలో దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.. పశ్చిమ బెంగాల్ లో అక్టోబర్ 4 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించనున్న దసరా వేడుకల నేపథ్యంలో ప్రముఖ బెంగాలీ సినీ నటులు, ఎంపీలు నుస్రత్ జహాన్, మిమీ చక్రవర్తితో ప్రత్యేక పాటను రూపొందించారు. బెంగాలీ భాషలో దుర్గామాత మీద రూపొందించిన ‘ఆశే మా దుర్గా శే’ పాటకు ఎంపీలు నుస్రత్ జహాన్, మిమీ చకవ్రర్తి డాన్స్ చేశారు. నటి సుభశ్రీ గంగూలీ కూడా ఈ వీడియోలో కనిపించడం విశేషం. సోమవారం కెప్టెన్ టీఎంటీ ఈ పాటను సామాజిక మాధ్యమాల్లో షేర్ చెయ్యగా వైరల్ గా మారింది. ఇప్పటికే 1.6 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

సహాయక చర్యల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలం : టీడీపీ నేతలు

Sat Sep 21 , 2019
గోదావరి బోటు ప్రమాదం జరిగి వారం రోజులయినా.. ఇంకా 16 మృతదేహాలను వెలికితీయాల్సి ఉంది. నదిలో సహాయక చర్యలు ముందుకు సాగడం లేదు. 250 అడుగుల లోతులో బోటును గుర్తించినా.. వరద ప్రవాహంతో బయటకు తీయడం కష్టసాధ్యంగా మారిందన్నారు అధికారులు. చర్యలను అధికారులు నిలిపివేసిన నేవీ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు.. తిరిగి వెళ్లిపోయాయి. అటు కచ్చులూరు పరిసరాల్లో 144 సెక్షన్‌‌ను పోలీసులు విధించారు. ఇప్పటి వరకు 35మృతదేహాలు లభ్యం కాగా.. వాటిని […]