ప్రపంచకప్‌లో మరో సంచలనం

ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. సౌతాఫ్రికాకు షాకిచ్చిన బంగ్లా తాజాగా వెస్టిండీస్‌పై స్టన్నింగ్ విక్టరీ కొట్టింది. హైస్కోరింగ్ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 321 పరుగులు చేసింది.వికెట్ కీపర్ హోప్ 96 , లూయీస్ 70 , హెట్‌మెయిర్ 50 పరుగులతో రాణించారు. ఛేజింగ్‌లో బంగ్లాదేశ్ ఆరంభం నుండే దూకుడుగా ఆడింది. తమీమ్ ఇక్బాల్ 48 , సౌమ్యా సర్కార్ 29 పరుగులకు ఔటవగా.. షకీబుల్ హసన్ మెరుపు సెంచరీతో జట్టును గెలిపించాడు. విండీస్ బౌలింగ్‌ను ఆటాడుకున్న షకీబుల్ 124 పరుగులు చేయగా.. లిట్టన్ దాస్ 94 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరి జోరుతో బంగ్లాదేశ్ మరో 8.3 ఓవర్లు మిగిలుండగానే టార్గెట్‌ను ఛేదించింది. ఈ ఓటమితో విండీస్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

జబర్ధస్త్ షోలో ఇకపై అనసూయ..!!

Tue Jun 18 , 2019
షో చేస్తున్న నటులతో పాటు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న యాంకర్లు రష్మీ, అనసూయ.. జడ్జిలుగా వ్యవహరిస్తున్న వారు.. ఇలా ప్రతి ఒక్కరూ ఈ షోకి ప్లస్ పాయింటే. అందుకే అంతగా సక్సెస్ అయింది. చిట్టి పొట్టి డ్రస్‌లు వేసుకుని చలాకీగా మాట్లాడుతూ బుల్లితెర ప్రేక్షకులను అలరించే అనసూయ ఇకపై జబర్ధస్త్ షో చేయదనే వార్తలు వినిపిస్తున్నాయి. రంగస్థలంలో రంగమ్మత్తగా నటించి అభిమానుల లిస్ట్‌ని పెంచుకున్న అనసూయకు వరుస ఆఫర్లు క్యూ కట్టేస్తున్నాయి. […]