పంది రేటు లక్ష రూపాయలు.. అయినా ఫుల్ డిమాండ్..

డిమాండ్‌కి తగ్గ ఉత్పత్తి లేదు. పందుల్ని బాగా పెంచండి అని ప్రభుత్వం చైనీయుల్ని ప్రోత్సహిస్తోంది. బాగా బరువున్న పందికైతే మరింత డిమాండ్. చైనాలో పందుల బిజినెస్ ద్వారా లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. వాటికి మంచి ఫుడ్ పెట్టి బాగా బలిష్టంగా తయారు చేస్తారు. ఇలా బలంగా దాదాపు 500 కేజీ వరకు పెరుగుతాయి. రేటు కూడా భారీగానే ఉంది. ఒక్కో పంది రేటు లక్షరూపాయలు పలుకుతోంది. పందుల పెంపకాలను ప్రభుత్వం ప్రోత్పహించినా అక్కడి వారికి సరిపోవట్లేదు. మాంసంతో పాటు పోర్క్ (పంది మాంసం) కూడా చైనీయులు బాగా తింటారు. దాంతో పందుల కొరత వచ్చింది. ప్రస్తుతం పందుల బిజినెస్ ద్వారా వ్యాపారులు మంచి లాభాలనార్జిస్తున్నారు. మనదేశంలో కోడి మాసం, మేక మాంసానికి ఉన్నంత డిమాండ్ చైనాలో పంది మాంసానికి ఉంది.

TV5 News

Next Post

ఆస్తి కోసం అందర్నీ వరుసగా.. 14 సంవత్సరాల్లో ఆరుగురిని..

Mon Oct 7 , 2019
ఆస్తి కోసం అత్తింటి వారందరినీ మట్టు పెట్టింది. ఎవరికీ ఏ మాత్రం అనుమానం రాకుండా గుండె పోటుతో మరణించారంటూ కథలల్లేది. చేసిన పాపం మరెంతో కాలం దాగలేదు. సంపన్న కుటుంబానికి చెందినా ఆస్తి ఎవరికీ దక్కకూడదు. తనకి మాత్రమే చెందాలన్న స్వార్థం. అరుగురిని హత్య చేయడానికి పురిగొల్పింది. కేరళలోని కోజికోడ్ జిల్లాలో పున్నమట్టోంది ఒక సంపన్న కుటుంబం. 2002 నుంచి 2016 వరకు ఆ ఇంటికి చెందిన ఆరుగురు వ్యక్తులు […]