ఆ 8 మంది రాజీనామాలు సరైన ఫార్మాట్‌లో లేవు: కర్ణాటక స్పీకర్‌

కర్ణాటకలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం నెలకోన్న సంక్షోభం క్లైమాక్స్‌ దశకు చేరినట్టు కనబడుతుంది. నాటకీయ పరిణామాల నేపథ్యంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఈ సాయంత్రం ప్రత్యేక విమానంలో ముంబయి నుంచి బెంగళూరు చేరుకున్నారు. క‌ర్నాట‌క రెబ‌ల్ ఎమ్మెల్యేలు త‌మ రాజీనామాల‌ను అసెంబ్లీ స్పీక‌ర్‌కు స‌మ‌ర్పించుకోవాల‌ని సుప్రీంకోర్టు నేడు స్ప‌ష్టం చేసింది. ఈ నేపథ్యంలో స్పీకర్ ను కలిసేందుకు అసమ్మతి కాంగ్రెస్, జేడీ(ఎస్) ఎమ్మెల్యేలు బెంగళూరులోని విధానసౌధకు చేరుకున్నారు. వారితో భేటీ అనంతరం స్పీక‌ర్‌ కేఆర్ రమేష్ మీడియాతో మాట్లాడారు. “నాపై కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసిన పట్టించుకోను. రాజీనామాల విషయంలో నిబంధనల ప్రకారమే వ్వవహరిస్తాను. రాజ్యంగం ప్రకారమే నా నిర్ణయం ఉంటుంది. స్పీకర్ పరిధిలోని అంశాలు కోర్టు వరకు ఎందుకు తీసుకెళుతున్నారని” పేర్కొన్నారు. 8 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు సరైనా ఫార్మాట్ లేవని తెలిపారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

బిగ్ బాస్‌‌పై బాంబ్ పేల్చిన శ్వేతారెడ్డి

Thu Jul 11 , 2019
టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించిన కమిట్మెంట్ కల్చర్ ఇప్పుడు బిగ్ బాస్ త్రీలో దుమారం రేపుతోంది. కంటెస్టెంట్ల ఎంపిక పై ఉత్కంఠ కొనసాగుతుండగానే కమిట్మెంట్ కల్చర్ కాంట్రవర్సీ చెలరేగింది. కమిట్మెంట్ ఇస్తేనే బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇస్తారా? అని బాంబ్ పేల్చారు శ్వేతారెడ్డి. మిమ్మల్ని ఎంపిక చేస్తే మాకేంటీ అంటూ ప్రశ్నిస్తున్నారని..కమిట్మెంట్ ఇస్తే లైన్ క్లియర్ చేసే ధోరణిలో ఎంపిక జరుగుతోందని బిగ్ బాస్ త్రీపై సంచలన […]