కంటిలో నుంచి తలలోకి దూసుకెళ్లిన కుక్కర్ విజిల్

Read Time:0 Second

ఇంట్లో వంటచేస్తున్న మహిళకు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. కుక్కర్ విజిల్.. మహిళ కంటి చూపును పొగొట్టింది. జార్ఖండ్‌లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది.

కుంతీ జిల్లాకు చెందిన మహిళ.. కుక్కర్లో వంట చేయడానికి స్టౌవ్ వెలిగించి.. బయటకు వెళ్లింది. మరో పనిలో పడి.. స్టౌవ్ మీద కుక్కరు ఉన్న విషయం మరిచిపోయింది. లోపలి వచ్చి చూస్తే.. స్టౌవ్ మీద కుక్కరు ఉంది. వెంటనే కుక్కరును పక్కకు పెట్టేందుకు ప్రయత్నించింది. అంతే.. అధిక ప్రెజర్‌ కారణంగా కుక్కరు విజిల్ ఒక్కసారిగా పైకి ఎగిరి ఆమె కంటిని చీల్చుకుంటూ తలలోకి వెళ్లింది. తీవ్రమైన నొప్పితో విలవిల్లాడుతున్న ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

ఆమెకు స్కాన్ చేసిన వైద్యులు కుక్కర్ విజిల్ మెదడుకు సమీపంలో ఇరుక్కున్నట్లు గుర్తించారు. వెంటనే వైద్యులు శస్త్రచికిత్స ద్వారా కుక్కర్ విజిల్‌ను మహిళ మెదడు నుంచి బయటకు తీశారు. దీంతో ప్రాణాపాయం నుంచి సదరు మహిళ బయటపడింది. కానీ కంటి చూపును కోల్పోయింది. ఇంట్లో కుక్కరు వాడేటప్పుడు.. మహిళలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Also watch :

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published.

Close