55ఏళ్ల మహిళ అనుమానాస్పద మృతి..

dead

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. నాగమణి అనే 55 ఏళ్ల మహిళ తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఐ.పోలవరం మండలం జీ వేమవరం గ్రామంలో ఈ ఘటన జరిగింది. మృతదేహంతో పాటు పరిసర ప్రాంతాల్లో కారం చల్లి ఉండటంతో.. అత్యాచారం చేసి హత్య చేసినట్లు భావిస్తున్నారు పోలీసులు. ఇంట్లో మంచం మీదే చనిపోయింది నాగమణి. ఉదయం పక్కింటి మహిళ.. నాగమణి ఇంటికి వెళ్లగా ఆమె చనిపోయి ఉండటంతో.. పోలీసులకు సమాచారమిచ్చింది. గత కొంతకాలంగా ఆమె ఒంటరిగా ఉంటోందంటున్నారు స్థానికులు. ఈ హత్యపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

TV5 News

Next Post

మందేసి చిందేశాడు.. తరువాత సస్పెండ్..

Tue Dec 3 , 2019
పోలీసు శాఖలో క్రమశిక్షణతో ఉండాల్సిన ఓ కానిస్టేబుల్ మద్యం మత్తులో రోడ్‌పై చిందులేశాడు. ఫలక్‌నామా పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఈశ్వరయ్య పీకలదాకా తాగి రాత్రి రోడ్‌పై పడిపోయాడు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కల్గింది. పక్కకు జరగాలని కోరిన వాహనదారులపైనా ఈశ్వరయ్య చిందులేశాడు. ఓ వాహనదారుడు తీసిన వీడియో వైరల్ కావడంతో నగర పోలీస్ కమిషనర్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు.