అమ్మ ఎంత మంచిది.. పుట్టిన వెంటనే బిడ్డ మరణించినా..

Read Time:0 Second

mother

నవమాసాలు మోసి బిడ్డను ప్రసవించింది. డెలివరీ కష్టమైనా పొత్తిళ్లలో ఉన్న బిడ్డను చూసి పడిన కష్టమంతా మరిచి పోయింది. కానీ అమ్మ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. పుట్టిన మూడు గంటల తర్వాత అమ్మ చేతిలోనే కన్నుమూశాడు. ప్రాణం లేని ఆ బిడ్డను హృదయానికి హత్తుకుని గుండెలవిసేలా రోదించింది. నన్ను ఏడిపించడానికే పుట్టావా కన్నా అని నిర్జీవంగా పడి ఉన్న బిడ్డను చూసి తల్లి మనసు తల్లడిల్లిపోయింది. బిడ్డకు పాలివ్వనిదే గుండెల బరువు తీరదని అంత వేదనలోనూ ఆలోచించింది. అమ్మ పాలు అందని పసి బిడ్డలకు తన పాలు అందించాలనుకుంది.

mother-milk

యూఎస్‌కు చెందిన సియెర్రా స్టాంగ్‌ఫెల్డ్ అనే మహిళకు ‘ట్రిసామీ 18’ అనే అరుదైన జన్యు సంబంధ సమస్యతో బిడ్డ పుట్టాడు. దీంతో బిడ్డ పుట్టిన మూడు గంటలకే చనిపోయాడు. అయితే, ఆమె స్థన్యంలో పాలు ఉన్నంత కాలం ఆ పాలను దానం చేసే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పడంతో అమ్మ మనసు ఊరట చెందింది. ఈ విధంగా అయినా మరి కొంత మంది పసి బిడ్డలకు తన పాలు ఉపయోగపడుతున్నందుకు సంతోషించింది. డాక్టర్ల సలహాను పాటిస్తూ 63 రోజుల పాటు ప్యాకెట్లలోకి పాలను పిండి ఇప్పటి వరకు 15 లీటర్ల పాలను దానమిచ్చింది.

పుట్టిన వెంటనే నా బిడ్డకు వెంటిలేషన్ పెట్టి శ్వాస అందించారు. నా స్పర్శ తగలగానే వాడి హార్ట్ రేట్ ఒక్కసారే పెరిగింది. నాతో ఎక్కువ సేపు ఉండలేదు. అమ్మపాలలోని కమ్మదనాన్ని వాడు ఆస్వాదించలేకపోయాడు. పుట్టిన మూడు గంటల్లోనే నా నుంచి దూరంగా వెళ్లిపోయాడు. బిడ్డకి పాలు పట్టడంలో ఉన్న ఆనందాన్ని మరి కొంత మంది బిడ్డలకి అందిస్తూ తృప్తి చెందుతున్నాను అని సియెర్రా కన్నీళ్లతో వివరించింది.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close