శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉద్యోగం చేస్తున్న యువతి మిస్సింగ్

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉద్యోగం చేస్తున్న ఓ యువతి అదృశ్యం మిస్టరీగా మారింది. ఇంటి నుంచి బయటకు వెళ్లి వారం రోజులైనా ఆచూకి తెలియలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు శంషాబాద్ ఎయిర్‌పోర్టు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. నల్గొండ జిల్లా కోదాడకు చెందిన 28 ఏళ్ల రాజ్యలక్ష్మి రెండేళ్లుగా విమానాశ్రయంలో తాత్కాలిక ఉద్యోగం చేస్తోంది. అవివాహితైన రాజ్యలక్ష్మి RB నగర్‌కాలనీలో అద్దెగదిలో నివసిస్తోంది. ఈ నెల 7న ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఆమె ఇప్పటి వరకు ఆచూకీలేదు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు శంషాబాద్ పోలీసులు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

అక్కా అని పిలిచి బండి ఎక్కమన్నాడు.. ఆపై

Thu Jun 13 , 2019
ముక్కూ మొహం తెలియని వ్యక్తి అక్కా అని ఆప్యాయంగా పిలిచేసరికి ఆనందపడిపోయింది. కానీ ఆ పిలుపు వెనుక ఉన్న పాడుబుద్దిని గ్రహించలేకపోయింది. ఆటోని రాంగ్ రూట్లోకి పోనిచ్చేసరికి.. వీడేదో దుర్బుద్ధితో ఉన్నాడని తలచి వెంటనే మేల్కొంది. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం గొడవర్రు గ్రామానికి చెందిన ఓ యువతి కంకిపాడుఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. బుధవారం రాత్రి డ్యూటీకి వెళ్లేందుకు ఆటోకోసం ఎదురు చూస్తోంది. ఇంతలో అదే గ్రామానికి చెందిన చోరగుడి […]