ఎంత ఓపిక.. 11 మంది పిల్లలు చాల్లేదంట.. 20వ సారి గర్భం..

ఒకర్నీ, ఇద్దర్నీ కనడమే కష్టమవుతున్న ఈ రోజుల్లో ఆమేంటో వరుసగా అంతమందిని.. కనడమే కష్టమనుకుంటే.. ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం మరింత కష్టం.. ఏంటా ధైర్యం.. ఎందుకిలాంటి సాహసం.. ఆరోగ్యం పాడైతే అంతమంది పిల్లల పరిస్థితి ఏంటి.. 20వ సారి గర్భం దాల్చిందని తెలుసుకుని వైద్య సిబ్బంది సైతం హతాశులవుతున్నారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మజల్‌గావ్ తహసీల్ పరిధిలోని కేశపురి ప్రాంతంలో సంచార గోపాల్ కమ్యూనిటీకి చెందిన 38 ఏళ్ల లంకాబాయి ఖరత్ అనే మహిళకు ఇప్పటివరకు 16 సార్లు ప్రసవం జరిగింది. మూడు సార్లు గర్భస్రావమైంది.

ఇప్పుడు మళ్లీ 7 నెలల గర్భం. ఇప్పటి వరకు ప్రతి కాన్పులో ఒక్కొక్కరే సంతానం.. ఐదుసార్లు మాత్రం బిడ్డలు పుట్టిన గంటల వ్యవధిలో మరణించారు. ప్రస్తుతం ఉన్న 11 మంది పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని చెబుతోంది లంకాబాయి. పైగా ఇప్పటి దాకా కాన్పులన్నీ ఇంట్లోనే జరిగాయని.. ఇప్పుడు మాత్రమే ఆస్పత్రిలో పురుడు పోసుకునేందుకు వచ్చానని అంటోంది. అయితే డాక్టర్లు లంకాబాయి విషయాన్ని సీరియస్‌గానే తీసుకున్నారు.

మహిళ శరీరంలో పిండం పెరిగే గర్భాశయం ఒక కండరంలా సాగిపోతుంది డెలివరీ అయిన ప్రతిసారీ. ఇలా ఎక్కువ సార్లు గర్భం దాలిస్తే గర్భాశయం సంకోచించడం కష్టమవుతుందని అన్నారు. వరుస కాన్పుల వల్ల గర్భసంచి బలహీనంగా మారుతుంది. తీవ్ర స్థాయిలో రక్తం కూడా పోయే అవకాశాలు ఉంటాయని.. నెలలు నిండకుండానే ప్రసవం జరుగుతుందని అంటున్నారు. ఏదేమైనా ఇద్దరు ముద్దు.. మూడో వాళ్లు వద్దు అన్న నినాదాన్ని పాటిస్తే మంచిదేమో.

Also watch :

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

దసరా నవరాత్రులకు TV5 స్పెషల్ ప్రోగ్రాం.. హిందూధర్మం ఛానెల్‌లో 'నవనాయకి' గేమ్‌ షో

Tue Sep 10 , 2019
దసరా పండుగ మహిళలకెంతో సరదా సంతోషాలను తీసుకువస్తుంది. బతుకమ్మల కోలాహలం.. దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు.. ప్రతి ఇల్లూ రంగుల హరివిల్లవుతుంది. దసరా తొమ్మిది రోజులు ప్రతి రోజు పండుగలానే అనిపిస్తుంది. కోలాటాలు, బతుకమ్మ ఆట పాటలతో, తెలుగింటి ఆడపడుచులు ఆనందపారవశ్యంలో మునిగి తేలుతుంటారు. ఈ సంబరాలను వినోదాత్మకంగా నిర్వహించాలని తలపోసింది టీవీ5 ఆధ్యాత్మిక ఛానెల్ హిందూధర్మం. నారీ మణుల కోసం ‘నవనాయకి’ అని ప్రత్యేక గేమ్‌షో నిర్వహించనుంది. అదృష్టలక్ష్మి నిర్వాహకులు, […]