ప్రభుత్వం తనకు భూమి ఇవ్వలేదని పాఠశాలకు తాళాలు వేసి మహిళ నిరసన

నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం మంగల్‌ పాడ్‌కు చెందిన ప్రభుత్వ పాఠశాలకు ఓ మహిళ తాళాలు వేసి నిరసన తెలిపింది. చిన్నూభాయి అనే మహిళ పదేళ్ల క్రితం,,పాఠశాల భవన నిర్మాణం కోసం ఎకరం భూమిని విరాళంగా ఇచ్చింది. దీనికి బదులుగా మరో చోట భూమి ఇస్తామని అధికారులు అప్పట్లో చిన్నూభాయికి హామీ ఇచ్చారు. సర్వే నెంబర్‌ 271, 273 భూమి కేటాయించారు..కానీ భూమిని చూపలేదు..రిజిస్ట్రేషన్ కూడా చేయలేదని బాధితురాలు వాపోయింది. దీంతో తనకు ప్రభుత్వం నుంచి వచ్చే రైతు బంధు వంటి పథకం అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. భూమి కోసం అధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టు ఎన్ని సార్లు తిరిగినా..ఎవరూ పట్టించుకోవడం లేదని చిన్నూభాయి తెలిపింది. ప్రభుత్వ పాఠశాల కోసం భూమి ఇస్తే తనకు మొండిచేయి చూపారని మహిళ ఆవాపోయింది. అందుకు నిరసనగా పాఠశాలలోని అన్ని తరగతి గదులకు తాళం వేసి నిరసన తెలిపింది. అయితే మహిళ తాళాలు వేయడం విద్యార్ధులకు ఇబ్బందులు తప్పడం లేదు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

అలా చేస్తే టీడీపీకి పట్టిన గతే వైసీపీకి పడుతుంది: కన్నా

Fri Jul 12 , 2019
ప్రధాని మోదీ సమర్ధవంతమైన పాలనకు ఆకర్షితులయ్యే..ఏపీలో వివిధ పార్టీల నేతలు బీజేపీలో చేరుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరితో కలిసి అయన శ్రీకాకుళంలో పర్యటించారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం పోలీసులతో పాలన సాగించాలని చూస్తే..టీడీపీకి పట్టిన గతే పడుతుందని కన్నా హెచ్చరించారు. విభజన అనంతరం ఏపీ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సహకారం అందించినా..ప్రజల్లో బీజేపీని దోషిగా చిత్రీకరించే ప్రయత్నం […]