బెల్ట్ షాప్‌పై మహిళల దాడి

మద్యం బెల్ట్‌ షాప్‌పై నారీలోకం కదం తొక్కింది. బెల్ట్‌షాప్‌పై దాడి చేసి మద్యాన్ని రోడ్డుపై పడేశారు. గ్రామంలో మద్యం అమ్మొద్దంటూ రైడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామంలో జరిగింది.

గ్రామంలో మద్యం అమ్మకాలు జోరుగా సాగడంతో మహిళల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తరుచుగా కుటుంబాల్లో గొడవలు జరగడం మహిళల కోపానికి కారణమైంది. ఇక లాభంలేదనుకుని గ్రామంలోని మహిళలు ఉద్యమించారు. బెల్ట్‌ షాప్‌పై దాడి చేశారు. ఆ తర్వాత రోడ్డుపై ధర్నా నిర్వహించారు.

TV5 News

Next Post

దొంగతనానికి వెళ్లి హెడ్‌మాస్టర్‌ను అతి దారుణంగా..

Wed Oct 9 , 2019
చోరీలకు అలవాటు పడిన ముగ్గురు మైనర్లు దారుణంగా హత్యలు చేసేస్థాయికి ఎదిగారు. దొంగతనానికి వెళ్లి హత్య చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ మండలం తూరంగిలో సెప్టెంబర్ 14న జరిగిన హత్య కేసులో నిర్ఘాంతపోయే విషయాలు వెలుగుచూశాయి. రేపూరు ప్రభుత్వ పాఠశాలలో హెడ్‌మాస్టర్‌గా పనిచేస్తున్న వెంకట్రావ్‌ అతిదారుణంగా హత్యకు గురయ్యారు. దీనికి కొన్నిగంటల ముందు వెంకట్రావ్‌ భార్య హైదరాబాద్‌ వెళ్లడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. లేదంటే ఆమెను కూడా హత్యచేసి […]