నకిలీ వీసాతో దుబాయ్‌ వెళ్లేందుకు యత్నించిన మహిళ అరెస్ట్

Read Time:0 Second

Rgi

నకిలీ వీసాతో దుబాయ్‌ వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ మహిళతో పాటు ఇందుకు కారకుడైన ఏజెంట్‌ను శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు చిత్తూరుజిల్లా పీలేరు వాసులుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పీలేరుకు చెందిన జ్యోతి అనే మహిళ దుబాయ్‌ వెళ్లేందుకు అదే ప్రాంతానికి చెందిన ఏజెంట్‌ షేక్ అబ్దుల్ ఖాదర్‌ భాషాను సంప్రదించింది. ఏజెంట్‌ అడిగినంత ముట్టజెప్పింది. అయితే ఆమె నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకున్న ఏజెంట్ జాబ్‌ వీసా పేరుతో టూరిస్టు వీసాను అంటగట్టి జారుకున్నాడు. ఈ విషయం తెలియని జ్యోతి కువైట్‌ వెళ్లేందుకు ప్రయత్నించగా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అది ఫేక్ వీసాగా గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. జ్యోతి ఫిర్యాదు మేరకు ఏజెంట్‌ను ఆర్జీఐఏ పోలీసులు అరెస్ట్ చేశారు.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close