దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించడంలో అతడి పాత్రే కీలకం

ప్రపంచ కప్ టోర్నీలో సౌతాఫ్రికా జట్టును ఓడించి ఆశ్చర్యానికి గురి చేసిన బంగ్లాదేశ్.. తాజా మ్యాచ్‌లో వెస్టిండీస్‌కు షాకిచ్చింది. ఏడు వికెట్ల తేడాతో బంగ్లా ఘన విజయం సాధించింది. విండీస్‌ నిర్దేశించిన 322 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా.. మరో 51 బంతులు మిగిలుండగానే కేవలం మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరింది.

బంగ్లాదేశ్‌ సీనియర్‌ ఆటగాడు షకీబుల్‌ హసన్‌ పరుగుల వరద పారించాడు.. బౌండరీలతో కరీబియన్‌ టీమ్‌పై విరుచుకుపడ్డాడు.. వచ్చిన బంతినల్లా బౌండరీకి తరలించాడు.. 99 బంతుల్లో 16 ఫోర్లతో 124 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.. అజేయ సెంచరీతో చిరకాలం గుర్తిండిపోయే ఇన్నింగ్స్‌ ఆడాడు. హసన్‌కు తోడుగా లిట్టన్‌ దాస్‌ కూడా దూకుడు చూపించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.. దాస్‌ 69 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 94 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

టాస్‌ ఓడి ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేసిన విండీస్‌.. 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 321 పరుగులు చేసింది.. షాయ్‌ హోప్‌ 96 పరుగులు, ఎవిన్‌ లూయిస్‌ 70 పరుగులు, హెట్‌ మెయిర్‌ 50 పరుగులు చేయడంతో స్కోరు 300 దాటింది.. చివరల్లో జేసన్‌ హోల్డర్‌ మెరుపులతో 321 పరుగులు పూర్తిచేసింది.. అయితే, ఈమ్యాచ్‌లో క్రిస్‌ గేల్‌, రసెల్‌ పరుగులేమి చేయకుండానే ఔటయ్యారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ ఆటను చూసి విండీస్‌ ప్లేయర్లు చూస్తూ ఉండిపోయారు. బంగ్లా బ్యాట్స్‌మెన్‌ బౌండరీల ప్రవాహానికి అడ్డుకట్ట వేయలేకపోయారు. ఏ దశలోనూ మ్యాచ్ చేజారిపోకుండా ఆద్యంతం విండీస్ బౌలర్లపై బంగ్లా బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం ప్రదర్శించారు. దీంతో రికార్డు లక్ష్యాన్ని అలవోకగా ఛేదించగలిగారు. మొత్తంగా షకీబ్‌ అనుభవం, లిట్టన్‌ దాస్‌ దూకుడుతో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. విండీస్‌ బౌలర్లలో రసెల్‌, థామస్‌లకు చెరో వికెట్‌ దక్కగా… సెంచరీతోపాటు రెండు వికెట్లు పడగొట్టిన షకీబ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

ఆగస్టు 15 వరకు హైదరాబాద్‌లో ..

Tue Jun 18 , 2019
వ‌ర్షకాల సీజ‌న్‌తో పాటు ఆక‌స్మికంగా సంభ‌వించే విప‌త్తుల‌ను ఎదుర్కొనేందుకు GHMC సిద్ధమైంది. ఆగస్టు 15 వరకు గ్రేటర్ హైదరాబాద్‌లో అన్ని రకాల హోర్డింగ్స్‌ను నిషేధించింది. విప‌త్తుల నివార‌ణకు ప్రత్యేక‌ బృందాలు రెడీ చేసింది. నగరంలోని 195 కేంద్రాల‌ను నీటిముంపు ప్రాంతాలుగా గుర్తించి చర్యలు చేపట్టింది GHMC. వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలకు GHMC సన్నద్ధం అవుతోంది. జలమండలి, విద్యుత్, మెట్రో, ట్రాఫిక్, ఫైర్, పోలీస్ ఇలా […]