ఓటమి నుంచి గెలవాలనే కసితో..

ఓటమి నుంచి గెలవాలనే కసితో..

ఓటమి నుంచి గెలవాలనే పట్టుదల మరింత పెరుగుతుంది. ఇది సరిగ్గా అతనికి సరిపోతుంది. అతని పేరే ఫ్రాంకీ జపాటా. కొత్త అవిష్కరణల సృష్టికర్త అయిన.. ఫ్రాంకీ జపాటా.... తాను సొంతంగా తయారుచేసిన జెట్‌ఫ్లైబోర్డ్‌ సహయంతో ఫ్రాన్స్‌-ఇంగ్లాండ్‌ల మధ్య ఉన్న ఇంగ్లీష్‌ ఛానల్‌ను దాటాడు. కేవలం 20 నిమిషాల్లోనే దాటి సరికొత్త రికార్డు సృష్టించాడు.

ఫ్రాంకీ జపాటా..! కొత్త ఆవిష్కరణల సృష్టికర్తమైన ఈ ఫ్రాన్స్‌ దేశస్తుడు ఇప్పుడు ఓ సరికొత్త రికార్డు సృష్టించాడు. తానే సొంతంగా తయారుచేసిన పవర్‌ అధారిత జెట్‌ఫ్లైబోర్డ్‌ సహయంతో గాలిలో ఎగురుతూ ఫ్రాన్స్‌-ఇంగ్లాండ్‌ల మధ్య ఉన్న ఇంగ్లీష్‌ ఛానల్‌ను దాటాడు. కేవలం 20 నిమిషాల్లోనే తిరిగి గమ్యస్థానానికి చేరుకోడం విశేషం.....గంటకు 160 నుంచి 170 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన జపటా.... గమ్యం చేరడానికి 30 కి.మీ ముందే ఓ సారి ఇంధనాన్ని నింపుకోన్నాడు. ఇందుకోసం ఒకసారి మాత్రమే పడవపై ల్యాండ్‌ అయ్యాడు. ఈ సాహసంలో భాగంగా ఎదురయ్యే విపత్కర పరిస్థితుల్లో జపటాకి సహాయం చేయడానికి రెండు హెలికాప్టర్లు ఇంగ్లీష్‌ ఛానల్‌ను దాటాయి.....

గతంలోనూ అనేక ప్రయత్నాలు చేసినప్పటికి.. ఇప్పుడు విజయం సాధించాడు ప్రాంకీ జపాటా. తాజాగా జులై నెలలో కూడా ప్రయత్నించి లక్ష్యం చేరడానికి 11 మైళ్ల ముందే నీటిలో పడిపోయాడు. అపుడు అతని ప్రయత్నం విఫలం కావడంతో అనేకమంది నిరాశ చెందారు. అయితే అదివారం చేసిన ప్రయత్నంలో అతడు సఫలీకృతుడు అయ్యాడు. కేవలం 20 నిమిషాల వ్యవధిలో అతడు గమ్యస్థానానికి చేరాడు. జపటాకు ఈ తరహా ఫ్లైబోర్డ్‌ జెట్‌సూట్‌ను తయారుచేయాడానికి 2018లో 1.3 మిలియన్‌ యూరోలను గ్రాంట్‌గా ఇచ్చింది ఫ్రాన్స్‌ సైన్యం . అనేక ప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు తన ప్రయోగం సఫలంకావడంతో జపటా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Tags

Read MoreRead Less
Next Story