ట్రంప్ మనసుపారేసుకున్న గోల్డెన్ టాయిలెట్.. చేతివాటం చూపించిన దొంగ..

ట్రంప్ మనసుపారేసుకున్న గోల్డెన్ టాయిలెట్.. చేతివాటం చూపించిన దొంగ..

బ్రిటన్ లోని ప్రఖ్యాత బ్లేన్హ్యం ప్యాలస్ మ్యూజియంలో భారీ చోరీ జరిగింది. ప్రసిద్ధ ఇటాలియన్ ఆర్టిస్ట్ మౌజీరియా కార్తిలన్ 18 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన టాయిలెట్ ను దుండగులు ఎత్తుకెళ్లారు. భారీ సంఖ్యలో సందర్శకులు రావడంతో ఈ దొంగతనానికి ఆస్కారం ఏర్పడిందని భద్రతా సిబ్బంది అనుమానిస్తున్నారు. గెలుపు ఒక ఎంపిక కాదు అనే టైటిల్ తో రోపొందించిన ఈ టాయిలెట్ ను పర్యాటకుల సందర్శనార్ధం మాజీ ప్రధాని చర్చిల్ జన్మించిన పక్కగదిలోనే ఏర్పాటు చేశారు. 8.8 కోట్ల విలువైన ఈ టాయిలెట్ ను నాలుగురోజుల క్రితమే సందర్శనార్ధం ఉంచగా అంతలోనే చోరీకి గురైంది.

ఇందులో 66 ఏళ్ల వృద్ధురాలు ప్రవేశం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాంతో ఇప్పటికే ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ఈ టాయిలెట్ పై మనసుపారేసుకున్నారు. ఈ బంగారు టాయిలెట్ ను గనక ఇస్తే దానికి బదులుగా విన్సెట్ వ్యాన్గో 1888 లో వేసిన విఖ్యాత ల్యాండ్ స్కైప్ స్నో పెయింటింగ్ ను ఇస్తామని చెప్పారు. కానీ అది ఇప్పుడు చోరీకి గురికావడం విశేషం.

Tags

Read MoreRead Less
Next Story