హాలీవుడ్ సినిమాలకు నెలవైన చోట దారుణమైన పరిస్థితి!

హాలీవుడ్ సినిమాలకు నెలవైన చోట దారుణమైన పరిస్థితి!

అమెరికాలోని అతిపెద్ద నగరాల్లో రెండవది, హాలీవుడ్ సినిమాలకు నెలవైన లాస్ ఏంజిల్స్ లో ఇళ్లు లేని వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. వారి సంఖ్య గతంకంటే ఈ యేడాది 12శాతం పెరిగినట్లు ఓ సర్వే వెల్లడించింది. ఎక్కువ మంది నిరుపేదలు, నిరక్షరాస్యులే నివాస స్థలం లేకుండా వీధుల్లో తలదాచుకుంటున్నట్లు లాస్ ఏంజిల్స్ హోమ్ లెస్ సర్వీస్ అథారిటీ స్పష్టంచేసింది.

నిత్యం దాదాపు 60వేల మంది ఫుట్ పాట్ ల మీద, పార్కులు, ప్రభుత్వం ఏర్పాటుచేసిన షెల్టర్ లో తలదాచుకుంటున్నారని వెల్లడించింది. ఎక్కువ మంది రోడ్లపక్కన గుడారాలు ఏర్పాటుచేసుకొని జీవిస్తున్నట్లు తెలిపింది. మరీ ముఖ్యంగా డౌన్ టౌన్ లలో నిరాశ్రయుల సంఖ్య అధికంగా ఉంటుందని స్పష్టం చేసింది. ప్రపంచంలోనే అత్యంత ప్రముఖమైన నగరాల్లో ఒకటైన లాస్ ఏంజిల్స్ లో ఇలాంటి పరిస్థితి ఏంటని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story