వంకర చేష్టలు మానని పాకిస్థాన్.. అభినందన్‌ను అవమానించేలా..

పాకిస్థాన్‌ కుక్క బుద్ది మారలేదు. ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి హెచ్చరించినప్పటికీ పాక్ వంకర చేష్టలు మానలేదు. తాజాగా IAF హీరో, వింగ్ కమాండర్ అభినందన్ వర్దమాన్‌ను వెకిలి చేష్టలతో అవమా నించింది. అభినందన్‌ ఇష్యూను వెటకారంగా వాడుకుంటూ ఓ యాడ్‌ను రూపొందించి వివాదం రేపింది.

క్రికెట్ వరల్డ్‌కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై హై టెన్షన్ నెలకొంది. వచ్చే ఆదివారం ఇండియా, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ హైటెన్షన్ మ్యాచ్‌పై పాకిస్థాన్ టీవీ ఓ యాడ్‌ను రూపొందించింది. ఆ వాణిజ్య ప్రకటన కోసం వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ ఘట‌న‌ను వెట‌కారంగా వాడుకున్నారు. టీమిండియాకు ప్రపంచ కప్ కొట్టే సామర్థ్యం లేదని, టీ కప్పే వాళ్లకు ఎక్కువ అని అర్థమొచ్చేలా ఆ యాడ్‌ను రూపొందిం చారు.

బాలాకోట్ దాడుల త‌ర్వాత వింగ్ కమాండర్‌ అభినంద‌న్ దురదృష్టవశాత్తూ పాకిస్థాన్ సైన్యానికి చిక్కాడు. శత్రు శిబిరంలో ఉన్నప్పటికీ అభినందన్ ధైర్యంగా వ్యవహరించా డు. ప్రశాంతంగా టీ తాగుతూ, పాక్ సైని కాధికారుల ప్రశ్నలకు కూల్‌గా సమాధానమిచ్చాడు. ఆ సంఘ‌ట‌న‌ను వాడుకుంటూ పాక్ ఛాన‌ల్ ఓ యాడ్‌ త‌యారు చేసింది. అభినంద‌న్ లుక్‌లో ఉన్న ఓ వ్యక్తికి టీమిండియా జెర్సీని వేశారు. టాస్ గెలిస్తే ఏం చేస్తారని ఆ వ్యక్తిని అడిగితే, ఐయామ్ సారీ నేనేమీ చెప్పకూడ‌దని సదరు వ్యక్తి బదు లిస్తాడు. చివరగా అభినందన్ లుక్‌లో ఉన్న వ్యక్తి టీ క‌ప్‌తో వెళ్తుంటే ఆ క‌ప్పును ఎక్కడికి తీసుకెళ్తున్నావంటూ లాగేసు కుంటారు. అంటే, టీమిండియా ప్రపంచకప్పును కొట్టలేక టీ కప్పును తీసుకెళ్తోందంటూ పాకిస్థాన్ టీవీ ఎగతాళి చేస్తోందని నెటిజన్లు మండిపడుతున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *