దేశాధ్యక్షుడే.. కానీ అమ్మాయిలతో..!

దేశాధ్యక్షుడే.. కానీ అమ్మాయిలతో..!

అయనో దేశాధినేత. కానీ చేసే పనులు మాత్రం అత్యంత జుగుప్సాకరంగా ఉంటాయి. అధికారమదంతో కొవ్వు తలకెక్కి జంతువులా రంకెలేస్తూ ప్రవర్తిస్తాడు.

అహంకారాన్ని తలకెక్కించుకొని.. వారిని ఓ ఆట బొమ్మల చూస్తాడు. ఆయనెవరో కాదు ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూరెట్టి..! ఓ అధ్యక్షుడిగా ప్రజలకు మంచి చేసే పరిపాలకుడిగా వార్తల్లోకి ఎక్కిన సందర్భాలు అత్యంత అరుదు. దిగజారుడు వ్యాఖ్యలు, అసభ్యకరమైన చేష్టలతో మీడియాలో నిత్యం నిలుస్తుంటారు. స్వదేశంలోనే కాదు ఆయన అతిథిగా ఏ దేశానికి వెళ్లినా బుద్ధిమాత్రం మారదు. మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తారు. తాజాగా అలాంటి ఓ ఘటనతో మరోసారి ఆయన వార్తల్లోకి ఎక్కారు.

అధ్యక్షుడి హోదాలో రోడ్రిగో డ్యూరెట్టి తాజాగా జపాన్‌కు నాలుగు రోజుల పర్యటనకు వెళ్లారు. ఈ టూర్‌లో భాగంగా ఆయన పిలఫ్పీన్స్ వాసులతో టోక్యోలో

ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంలో ఆయన బుద్ది గడ్డి తింది. తాను ముద్దుపెట్టుకొనేందుకు వీలుగా ఐదుగురు మహిళా వలంటీర్లను వేదికకు దగ్గరలో

కూర్చోబెట్టాలని నిర్వాహకులను కోరారు. స్టేజి ఎక్కడమే అలస్యం ఓ మహిళా వాలింటర్ దగ్గరకు వెళ్ళి ముద్దాడాడు. ఈ సమయంలో ఆమె చాలా ఇబ్బంది పడింది.

ఆ స్త్రీ పెదాలపై ముద్దు పెడుతుండగా ఆమె వద్దని చెప్పింది. దీంతో ఆయన చెంపలపై ముద్దుపెట్టుకొని పంపించారు. మిగతా వాలింటర్స్‌ను కూడా ఇలానే ముద్దు పెట్టి అక్కడి నుంచి పంపించారు.

తర్వాత వేదికపై నుంచి మాట్లాడుతూ ‘‘నేను సాధారణంగా ముద్దులు పెదవులపైనే పెడతాను . కానీ ఈ కార్యక్రమంలో నన్ను నపుంసకుడుని కాకుండా ఈ మహిళలు కాపాడారు". అంటూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. అంతటితో అగకుండా తన ప్రత్యర్ధి సెనెటర్ ఆంటోనియోను "హోమో"గా విమర్శించారు. ఆయన ప్రసంగాన్ని వింటున్నవారికి ఈ మాటలు అసహ్యంగా అనిపించాయి. అతడు దేశాధ్యక్షుడు కాబట్టి ఆయన హోదాకు గౌరవం ఇచ్చి చప్పట్లు కొట్టి ఊరుకున్నారు. ఈ తతంగం అంతా రోడ్రిగో..తన భార్య ఎదుటే చేయడం గమనార్హం.

Tags

Read MoreRead Less
Next Story