భారత జాతీయ జెండాలను ధ్వంసం చేసిన పాకిస్తానీయులు

ఆగస్టు 15 సందర్భంగా లండన్‌ లోని భారత హైకమిషన్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కశ్మీర్‌ వ్యవహారంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రగిలిపోతున్న పాకిస్తానీయులు తమ అక్కసును విదేశాల్లో కూడా చూపిస్తున్నారు. ఇందులో భాగంగా ఇండియా ఎంబసీ వద్ద నిరసనకు దిగారు. స్వాతంత్ర వేడుకులు జరుపుకుంటున్నభారతీయులపై దాడులకు తెగబడ్డారు.

భారత హైకమిషన్ కార్యాలయం బయట భారతీయులు స్వాతంత్ర దినోత్సవ వేడుకులు జరుపుకుంటున్నారు. అయితే పాకిస్తానీయులు వేలాది మంది ఒక్కసారిగా ర్యాలీగా వచ్చి భారతీయులను తిడుతూ.. వారిపై రాళ్లు, బాటిల్స్‌, కోడిగుడ్లు విసిరేశారు. కశ్మీర్‌ మరియు పాకిస్తాన్‌ జెండాలతో వచ్చి ఇక్కడ విధ్వంసం సృష్టించారు. ఆందోళనకారుల తీరుతో లండన్‌ సెంట్రల్‌ నగరం స్తంబించిపోయింది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కు విదేశాంగ సలహదారుడిగా ఉన్న జుల్ఫీ బుకారి ఆందోళనకు నేతృత్వం వహించడమే కాదు.. ఆందోళనకారులను రెచ్చగొట్టేలా ప్రసంగించాడు. దీంతో పాకిస్తానీయులు రెచ్చిపోయి దాడికి తెగబడ్డారు.

ఆందోళనకారుల తీరుపై భారతీయులు మండిపడుతున్నారు. పాకిస్తాన్‌ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టిందని.. లండన్‌ లోని భారతీయులు ఆరోపిస్తున్నారు. భారతీయ వస్తువులను, జెండాలను ధ్వంసం చేశారు. స్వాతంత్రం వేడుకుల్లో పాల్గొనేందుకు వచ్చిన చిన్నారులు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. భౌతికదాడులకు తెగబడ్డారు. పోలీసులు దాడులకు కారణమైన వారిపై కేసులు పెట్టి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తానీయుల తీరునకు నిరసరగా భారతీయులు జాతీయ జెండాతో శాంతియుతంగా ర్యాలీ చేపట్టారు. హైకమిషన్‌ ముందు జరిగిన ఘటనపై లండన్‌ మేయర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానిబోరిస్ జాన్సన్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *