భారత్- అమెరికా దేశాల మధ్య ఈ వారంలో చర్చలు

భారత్- అమెరికా దేశాల మధ్య ఈ వారంలో చర్చలు

భారత్- అమెరికా దేశాలకు చెందిన రక్షణ, దౌత్య అధికారుల మధ్య చర్చలు ఈ వారంలో జరుగనున్నట్లు అధికారులు తెలిపారు. ఇండో పసిపిక్ ప్రాంతంలో వ్యూహాత్మక భాగస్వామాన్ని బలోపేతం చేసేలక్ష్యంతో ఇరుదేశాల అధికారుల మధ్య చర్చలు జరుగనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కాలిఫోర్నియాలో జరిగే ఈ సమావేశంలో భారతీయ అధికారులతో అమెరికాకు చెందిన దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల సెక్రటరీ, ఇండో పసిపిక్ ప్రాంత రక్షణ శాఖ సెక్రటరీలు పాల్గొంటారు. ఇరుదేశాల మధ్య క్లిష్టతరమైన దౌత్య వ్యవహారాలు, భద్రతా పరమైన అంశాల సహాకారంపై ప్రముఖంగా చర్చించనున్నారు. అనంతరం నిర్వహించే ఇరుదేశాల మంత్రుల స్థాయి చర్చల అంశాలను వీరు సమీక్షిస్తారు. గత సంవత్సరం జరిగిన చర్చల్లో దివంగత విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మాస్వరాజ్, అప్పటి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ లు పాల్గొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story