అయ్యప్ప మాల ధరించిన స్టూడెంట్.. సస్పెండ్‌ చేసిన స్కూల్ యాజమాన్యం

nlg

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఇండియన్‌ మిషన్‌ స్కూల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఓ విద్యార్థి అయ్యప్ప స్వామి మాల ధరించి రావడంతో.. స్కూల్‌ యాజమాన్యం సీరియస్‌ అయ్యింది. అక్కడితో ఆగకుండా స్కూల్‌కు అయ్యప్ప మాల ధరించి వచ్చాడనే కోపంతో.. విద్యార్థిని 40 రోజులు సస్పెండ్‌ చేసింది స్కూల్‌ యాజమాన్యం.

అయ్యప్ప మాల వేసుకున్నాడనే కారణంతో విద్యార్థిని సస్పెండ్‌ చేయడంపై అయ్యప్ప భజన మండలి, విశ్వహిందు పరిషత్‌ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ సంఖ్యలో స్కూల్‌కు చేరుకొని యాజామాన్యానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. మరోవైపు విద్యార్థి బంధువులు స్కూల్ అద్దాలు పగలగొట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. ఈ ఘటనపై మండల విద్యాధికారి స్పందించారు.. పూర్తి విచారణ చేపట్టి యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

TV5 News

Next Post

కేసీఆర్‌కు దొరకని ప్రధాని అపాయింట్‌మెంట్‌

Tue Dec 3 , 2019
విభజన సమస్యలపై కేంద్రంతో చర్చించేందుకు హస్తిన వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఒక వివాహ వేడుకకు హాజరైన ఆయన.. తరువాత రాష్ట్ర సమస్యలపై ప్రధాని సహా, పలువురు కేంద్రమంత్రులను కలవాలి అనుకున్నారు. కానీ ఎవరి అపాయింట్‌ దొరకకపోవడంతో ఆయన వెనుదిరిగినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం హస్తిన వెళ్లిన ఆయన.. తెలుగురాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి యత్నించారు. వీటిపై చర్చించేందుకు ప్రధాని […]