మహిళా రైతు యలమంచిలి పద్మజకు అండగా నిలిచిన టీడీపీ

Read Time:0 Second

tdp

గుంటూరు జిల్లా ఎర్రబాలెం గ్రామానికి చెందిన మహిళా రైతు, టీడీపీ సానుభూతి పరురాలు యలమంచిలి పద్మజకు తెలుగుదేశం నేతలు అండగా నిలిచారు. గత నెల 26న పద్మజ మంత్రి కొడాలి నానిని విమర్శించిందంటూ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కృష్ణా జిల్లా కంచించర్ల పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు స్టేషన్ బెయిల్‌పై పద్మజను విడిపించారు. స్థానిక నాయకురాలు సౌమ్య స్వయంగా తన కారులోఆమెను ఇంటికి తీసుకెళ్లారు. గుంటూరు జిల్లా నాయకులు మద్దాలి గిరి, జీవీ ఆంజనేయులు, రామానాయుడు, పోతినేని శ్రీను, గంజి చిరంజీవి తదితర నేతలు పద్మజకు సంఘీభావం ప్రకటించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పద్మజను ఫోన్లో పరామర్శించారు.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close