ప్రజాస్వామ్యానికి ముప్పు : యనమల

సింగపూర్‌ వెళ్లి ఏపీ ప్రతిష్ట దెబ్బతినే విధంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. అమరావతికి నిధులు లేవంటూ తన విధానాన్ని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి అంతా వికేంద్రీకరణేనన్నారు. రాష్ట్రంలో ఆర్ధిక కార్యకలాపాలను జగన్‌ చావు దెబ్బతీశారని యనమల ఫైరయ్యారు. ఇప్పుడు ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని.. అయినా, తన పాలనను ప్రజలు మెచ్చుకుంటారని జగన్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఆరు నెలల్లో మంచి సీఎం అనిపించుకుంటా అని చెప్పి.. 100 రోజుల్లోనే ఇంతకన్నా చెడ్డ సీఎం లేరని నిరూపించుకున్నారని యనమల ఎద్దేవా చేశారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

దాడులపై సుజనా చౌదరి ఆవేదన.. ఆలోచనలు మారలేదు : మంత్రి బొత్స

Fri Sep 13 , 2019
అమరావతిపై ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని బీజేపీ మరోసారి డిమాండ్‌ చేసింది. రాజధాని మార్చడం అంత సులభమైన విషయం కాదన్నారు ఆ పార్టీ ఎంపీ సుజనా చౌదరి. పోలవరం ప్రాజెక్టు విషయంలో రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలన్న నిర్ణయంపైనా పునఃసమీక్ష చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాడులు పెరుగుతుండడంపైనా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలపై దాడులను నిరసిస్తూ త్వరలోనే ఒక కార్యాచరణ ప్రకటిస్తామని సుజనా చౌదరి చెప్పారు. సుజనా చౌదరి వ్యాఖ్యలపై […]