కర్నూలులో వైసీపీ కార్యకర్తలు దాడి.. నలుగురికి తీవ్రగాయాలు

 

కర్నూలు జిల్లా కాల్వబుగ్గలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. తాగునీరు సరఫరా చేయమన్నందుకు కాలనీవాసులపై దాడి చేశారు. కర్రలు, బండరాళ్లతో దాడి చేయడంతో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. బోరు స్టాటర్ కాలిపోవడంతో నాలుగు రోజులుగా కాలనీకి తాగునీరు అందడం లేదు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోకపోవడంతో కాలనీవాసులే స్టాటర్ బిగించుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే తమ అనుమతి లేకుండా స్టాటర్ ఎలా బిగిస్తారని వైసీపీ కార్యకర్తల దాడి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించకపోతే.. మా సమస్య మేమే పరిష్కరించుకోవటం తప్పా అని అంటున్నారు.

TV5 News

Next Post

ఆమెకు రక్షణ ఏది.. తండ్రే కామాంధుడైన వేళ..

Sat Nov 16 , 2019
నాన్నా పక్కింటి అంకుల్.. అని తండ్రితో చెబుదామంటే అతడి చూపులు కూడా తినేసేలా ఉంటున్నాయి. ఇక ఆమెకు రక్షణ ఏది. తండ్రి, అన్న, అంకుల్.. పేరేదైతేనేం.. వరసలు ఏవైతేనేం.. అమ్మాయి కనబడితే చాలు.. ఆబగా చూస్తున్నాడు.. తండ్రిని కూడా అనుమానించే రోజులు.. కూతురికి పెళ్లైంది. అత్తారింటి వెళ్లింది. చుట్టుపు చూపుగా అల్లుడు లేని సమయంలో కూతురింటికి వెళ్లాడు. బుద్దిగడ్డి తిని కూతురిపైనే కన్నేశాడు. కటకటాలపాలయ్యాడు. కొత్తగూడెంకు చెందిన రమేశ్ (55) […]