టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతల దాడి.. ఆస్పత్రికి తరలింపు..

కృష్ణా జిల్లాలో కంకిపాడు మండలం మద్దూరు దసరా ఉత్సవాల్లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడి చేశారు. దీంతో ఐదుగురు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను విజయవాడ ఆస్పత్రికి తరలించారు. దసరా వేడుకలు జరుపుకుంటున్న తమపై నిందితులు ఎక్కడ నుంచో వచ్చి దాడి చేశారని బాధితుల బంధువులు పేర్కొన్నారు. ఘటనస్థలికి చేరుకున్న కంకిపాడు పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను టీడీపీ నేతలు పరామర్శించారు.

TV5 News

Next Post

పాకిస్తాన్‌లో మళ్లీ మిలిటరీ పాలన.. ఇమ్రాన్ డౌటేనా?

Wed Oct 9 , 2019
పాకిస్తాన్‌లో మళ్లీ మిలిటరీ పాలన రాబోతుందా.? పాకిస్తాన్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే..అలాగే అనిపిస్తోంది. ఇమ్రాన్ పర్యటనలో ఆర్మి అధికారుల దూకుడు పలు సందేహాలకు తావిస్తోంది. ప్రస్తుతం పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ చైనాలో పర్యటిస్తున్నారు. అయితే.. పర్యటనకు ముందు ఇమ్రాన్‌ కొందరు ఉన్నతాధికారులు మాత్రమే ఈ బృందంలో ఉన్నారు. కానీ చివరి 24 గంటల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. కొందరు మంత్రులతోపాటు పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఖమర్ […]