టిక్‌టాక్ పిచ్చికి మరో యువకుడు బలి

టిక్‌టాక్ పిచ్చి ఓ యువకుడి ప్రాణం తీసింది. టిక్‌టాక్ కోసం ఓ వాగు వద్ద మొబైల్‌లో వీడియోలు తీస్తుండగా.. ప్రమాదవశాత్తూ అతను నీళ్లలో కొట్టుకుపోయి చనిపోయాడు. ఈ విషాదకరమైన ఘటన నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం గొనుగొప్పులలో జరిగింది. రెండ్రోజుల గాలింపు తర్వాత ఇవాళ మృతదేహాన్ని బయటకు తీశారు.

గోనుగొప్పుల గ్రామానికి చెందిన దినేష్, మనోజ్, గంగాచలం ముగ్గురూ కలిసి సమీపంలోని కప్పలవాగు అలుగు వద్దకు వెళ్లారు. అక్కడ కొన్ని సినిమా పాటలకు సరదాగా టిక్‌టాక్ వీడియోలు చేస్తున్నారు. ఇంతలో కాలు పట్టుతప్పి దినేష్ కొట్టుకుపోయాడు.

Also watch :

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

బోటు ప్రమాదంలో మరో మహిళ మృతదేహం లభ్యం

Sun Sep 22 , 2019
గోదారి తీరంలో విషాద ఘోష ఇంకా మార్మోగుతూనే ఉంది. గత ఆదివారం మధ్యాహ్నం సమయంలో 77 మందితో వెళ్తున్న పడవ మునిగిపోయినా.. ఇంకా మృతదేహాల వెలికితీత పూర్తికాలేదు. ఆదివారం ఉదయం దేవీపట్నం మండలం మూలపాడు వద్ద ఓ మహిళ మృతదేహం దొరికింది. పూర్తిగా పాడైన స్థితికి చేరుకోవడంతో వెంటనే రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పోస్ట్‌మార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేశారు. తాజాగా దొరికిన మహిళ […]