వైఎస్ వివేకా హత్య కేసు.. వాచ్ మెన్‌ను విచారించిన అధికారులు

సంచలనంగా మారిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు వేగవంతమైంది. గత ప్రభుత్వం నియమించిన సిట్ స్థానంలో కొత్త దర్యాప్తు బృందాన్ని నియమించారు. ఈ టీమ్ లో మొత్తం 23 మంది అధికారులు ఉన్నారు. ఇందులో ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్సైలతోపాటు ఇతర సిబ్బంది ఉన్నారు. కొత్త దర్యాప్తు బృందం పులివెందులలోని వివేకా ఇంటిని పరిశీలించింది. అక్కడ వాచ్ మెన్ రంగయ్యను ప్రశ్నించారు అధికారులు.

మార్చి 15న పులివెందులలోని తన స్వగృహంలో దారుణంగా హత్యకు గురయ్యారు వైయస్ వివేకానందరెడ్డి. బాత్ రూంలో పడున్న ఆయన మృతదేహాన్ని సహాయకులు గుర్తించారు. మొదట గుండెపోటుతో మృతి చెందారని ప్రచారం జరగ్గా పోస్టుమార్టం అనంతరం అది హత్యగా తేలింది. శరీరంపై 7 చోట్ల గాయాలున్నట్లు వెల్లడైంది.

ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హత్యపై అనేక అనుమానాలు వ్యక్తం కావడంతో…అప్పటి ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది.. సిట్‌ అధిపతిగా అభిషేక్‌ మహంతిని నియమించింది. ఇప్పుడు ఈ సిట్ స్థానంలోనే కొత్త దర్యాప్తు బృందాన్ని నియమించారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికపై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి హర్షం

Wed Jun 19 , 2019
17వ లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దిగువసభలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఓం బిర్లాకు మద్దతు తెలిపాయి. సభ ప్రారంభమైన వెంటనే ఓం బిర్లా పేరును ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, గడ్కరీ, బిర్లా పేరును బలపరిచారు. ఇతర పార్టీల నుంచి నామినేషన్లు రాకపోవడంతో బిర్లా ఎన్నిక ఏకగ్రీవమైంది. బీజేపీ యువమోర్చా నాయకుడిగా పనిచేసిన […]