ఏపీలో మరో పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్

Read Time:0 Second

ఆంధ్రప్రదేశ్‌లో ‘YSR కంటి వెలుగు’ పథకం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని అనంతపురంలో సీఎం జగన్‌ ప్రారంభించారు. మూడేళ్లపాటు 6 విడతలుగా రాష్ట్రంలోని 5 కోట్ల 40 లక్షల మందికి నేత్ర పరీక్షలు చేస్తామని చెప్పారు. తొలిదశలో 70లక్షల మంది విద్యార్థులకు ప్రాథమిక పరీక్షలు చేయనున్నారు. అవసరమైన వారికి తదుపరి చికిత్సలు, కళ్లద్దాలు ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు.

ఏపీలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కంటి పరీక్షల కిట్లు పంపించారు. ఆరోగ్యశ్రీ పథకాన్నీ బలోపేతం చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఆరోగ్య శ్రీ లో కవరయ్యే వ్యాధుల సంఖ్య పెంచుతామన్నారు. బయటి రాష్ట్రాల్లోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో చికిత్సకు అనుమతిస్తామని జగన్ తెలిపారు.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close