ప్రపంచకప్.. భారత్‌కు దక్కిన ప్రైజ్ మనీ..!!

ప్రపంచకప్‌లో భారత్ తన ప్రస్థానాన్ని సెమీస్‌తోనే ముగించింది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. సెమీఫైనల్లో ఓడిన భారత జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సుమారు రూ.5.47 కోట్లు (0.8 మిలియన్ డాలర్లు) ప్రైజ్ మనీగా ఇవ్వనుంది. టోర్నీ మొత్తం ప్రైజ్ మనీ 10 మిలియన్ డాలర్లు. లీగ్ దశలో గెలిచిన ఒక్కో మ్యాచ్‌కు గాను జట్టుకు సుమారు రూ.27.4 లక్షలు (40 వేల డాలర్లు) చొప్పున అందిస్తారు. అయితే సెమిస్‌కు చేరిన ప్రతి జట్టుకూ 0.8 మిలియన్ డాలర్ల చొప్పున ప్రైజ్ మనీ దక్కుతుందని ఐసీసీ తెలిపింది. దీని ప్రకారం భారత్, ఆస్ట్రేలియా జట్లకు రూ.5.47 కోట్లు ప్రైజ్ మనీని అందుకుంటారు. అయితే ఫైనల్‌గా కప్‌ని గెలుచుకున్న విజేతలకు 4 మిలియన్ల డాలర్లు అంటే సుమారు రూ.27.38 కోట్లు ప్రైజ్ మనీ లభిస్తుంది. రన్నరప్‌కు 2 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.13.7 కోట్లు లభిస్తుంది.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

రైతులపై వరాలు కురిపించిన ఏపీ బడ్జెట్‌

Fri Jul 12 , 2019
ఆంధ్రప్రదేశ్‌ వార్షిక బడ్జెట్‌ను (2019-20) ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇందులో వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.20,677 కోట్లు, సాగునీరు, వరద నివారణకు రూ.13,139 కోట్లు, వైఎస్సార్‌ రైతు భరోసాకు రూ.8,750 కోట్లు కేటాయించారు. *రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌కు రూ. 4525 కోట్లు *రైతులకు ఉచిత బోర్లకు : రూ.200 కోట్లు *విత్తనాల పంపిణీ : రూ.200 కోట్లు *ధరల స్థిరీకరణ నిధి : […]