Live News Now
 • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
 • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
 • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
 • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
 • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
 • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
 • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
 • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
 • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
 • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం
టాలీవుడ్
 • NTR-new-Movie-First-Look
 • Bharat-Ane-Nenu-Pre-Release-Event-Photos2
 • Bharat-Ane-Nenu-Pre-Release-Event-Photos1
 • Bharat-Ane-Nenu-Pre-Release-Event-Photos
 • NTR-biopic-Photo1
సినీ గాసిప్స్
rashmi-gautam-responds-on-marriage
టెలివిజన్ స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ పెళ్లిపై వచ్చే గాసిప్స్‌కు ఎంత క్రేజ్ చెప్పనక్కర్లేదు. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకొంటారు అనే ఊహాగానాలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతుంటాయి. రష్మీని నెటిజన్లు ఎక్కువగా సుడిగాలి సుధీర్‌తో పెళ్లి ఎప్పుడు అని అడిగుతుంటారట. వారికి ఆమె ఇచ్చే సమాధానం  సుధీర్ నేను ప్రొఫెషనల్‌గా మంచి ఫ్రెండ్స్. ఇద్దరం కలిసి కొన్ని షోలు చేస్తున్నాం. అదేకాకుండా చాలా ఈవెంట్లు చేస్తుంటాం. అందరితో క్లోజ్‌గా ఉన్నట్టే సుధీర్‌తో కూడా ఉంటాను. అంతా మాత్రాన ఇద్దరం పెళ్లి చేసుకొంటారా అని వాళ్లకు స్వీట్ వార్నింగ్ ఇస్తుందట ఈ అమ్మడు.  

ఇది ఇలా ఉంటే మరోసారి ఆమె పెళ్లి గురించి ప్రశ్నించిన నెటిజన్లుకు సమాధానం ఇచ్చింది. దేనికైనా టైమ్ రావాలని తమ తాత చెప్పారని.. ఆ సమయం వచ్చినప్పుడు అదే అవుతుందంటూ పెళ్లి విషయం దాటేసింది. మరీ రష్మీకి పెళ్లి అయ్యేంత వరకు ఇలాంటి తిప్పలు తప్పవని అనుకుంటున్నారు ఆమె ఫ్రెండ్స్.
shah-rukh-khan-daughter-suhana-dating-with-cricketer
సినీ తారలు, క్రికెటర్ల మద్య రొమాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొంత మంది క్రికెటర్స్ బాలీవుడ్ భామలతో డేటింగ్‌ చేస్తున్నారంటూ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ఇటీవలే యువ క్రికెటర్ కేఎల్ రాహుల్, అందాల భామ నిధి అగర్వాల్ డేటింగ్‌లో ఉన్నట్లు సోషల్‌మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా మరో వార్త బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ యజమాని షారుఖ్‌ ఖాన్‌ కూతురు సుహానా ఖాన్‌ యువ క్రికెటర్‌ శుబ్‌మాన్‌ గిల్‌తో ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్‌ మ్యాచ్‌ల అనంతరం నైట్‌రైడర్స్‌ యువ ఆటగాడు గిల్‌తో సుహానా క్లోజ్‌గా ఉండటంతో ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. ప్రస్తుతం వీరు ఫబ్‌లకు, పార్టీలకు తిరుగుతున్నారని, ఈ జంట డేటింగ్‌లో ఉందంటూ సోషల్‌మీడియా కోడై కూస్తోంది. 
Interesting-buzz-on-NTR-Ram-charan-multi-starer-Movie
తారక్, చెర్రీలతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టార‌ర్ మూవీపై రోజుకో వార్త చక్కర్లుకొడుతుంది. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగానే అభిమానుల్లో సినిమా సందడి మొదలైపోయింది. రూ.300 కోట్ల బడ్జెట్ తో డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. అధికారికంగా రాజమౌళి ఈ మూవీ స్టోరీ గురించి సింగల్ లైన్ కూడ చెప్పకముందే ఈ సినిమా కథకు సంబందించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్లో హల్‌చల్ చేస్తోంది. అదేమిటంటే ఈ మూవీలో చెర్రీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని, ఆయన సోదరుడిగా తారక్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్నారంటూ టాలీవుడ్ టాక్. అంతేగాక ఈ సినిమాలో విజువల్స్, యాక్షన్ సీక్వెన్సెస్ హైలెట్‌గా ఉంటాయని మాట్లాడుకుంటున్నారు. మరి ఈ వార్తలన్నీ నిజమో కాదో తెలియాలంటే జక్కన్న నోరు విప్పాల్సిందే.  
tarak-aravindha-sametha-movie
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో వస్తున్న అరవింద సమేత వీర రాఘవ మూవీకి సంబంధించి రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. తాజాగా ఓ ఆసక్తికర అప్‌డేట్ టాలీవుడ్‌లో వినిపిస్తోంది. తారక్ సరసన పూజాతో పాటు మరో హీరోయిన్‌గా అచ్చమైన పదహారణాల తెలుగమ్మాయి ఇషారెబ్బాని తీసుకున్నారట. ఇషారెబ్బా ఈ పేర్లో ఓ స్టైల్‌ ఉంది, మత్తు ఉంది. మరీ ఆమె పేరులోనే వైబ్రేషన్స్‌ ఉన్న ఈ పక్కాలోకల్ తారక్ సరసన నటించడం అదుర్సు అంటున్నారు ఇషా అభిమానులు. 

రాయలసీయ ఫ్యాక్షనిజం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగబాబు, జగపతి బాబులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  కాజల్‌ అగర్వాల్‌ ఈ మూవీలో ఓ సాంగ్‌కి తారక్‌తో కలిసి స్టెప్పులేస్తుందని మరో వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 
Image may contain: 2 people, people smiling, closeup
shriya-saran-new-movie
టాలీవుడ్‌ని తన అందచందాలతో ఒక ఊపు ఊపిన శ్రియ ఈ మధ్యకాలంలో కాస్త జోరుతగ్గించింది. సినీ ఇండస్ట్రీలో 17 ఏళ్లుగా రాణిస్తున్న ఈ అమ్మడు వివాహం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత తెలుగులో మళ్లీ ఈ సుందరికి ఆఫర్లు వస్తుండడంతో తన సెంకడ్ ఇన్నింగ్స్‌ ని మెదలుపెడుతోంది. తాజాగా శ్రియ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. "హీరోలతో పోల్చితే తెరపై హీరోయిన్ లు  కనిపించేది చాలా తక్కువగా ఉంటుంది. ఇండస్ట్రీలో పూర్తిగా పురుషాధిక్యతే కనిపిస్తుంది. కథలు కూడా హీరోయిజాన్ని బేస్ చేసుకునే ఉంటాయి. దీనివల్ల కథానాయికలు ఎలాంటి స్క్రిప్ట్‌లు ఎంచుకోవాలనుకునే విషయంలో తడబడుతుంటారు. అనుకోకుండా కొన్ని మూవీలకు ఓకే చెబుతుంటారు. నేను కూడా ఇలాంటి తప్పుల్ని చేశాను అని చెప్పుకొచ్చింది ఈ ఢిల్లీ సొగసరి శ్రియ. 
tamannaah-speech-about-na-nuvve-movie-story
మిల్కీ బ్యూటీ ఈ పేరు వింటే చాలు కుర్రకారుల హృదయాల్లో ఓ రకమైన అలజడి మొదలవుతుంది. తన అందం, అభినయంతో యూత్‌కి చెమటలు తెప్పిస్తోంది ఈ అమ్మడు.  తమన్నా తెరమీద స్టెప్ వేస్తే ఫ్యాన్స్‌కి తడిసిపోవలిసిందే. బ్యాచిలర్స్‌ కి నిద్రలేకుండా చేస్తున్న ఈ బ్యూటీని డైరెక్టర్ నిద్రలేపి మరి కథ వినిపించాడట. ఎవరైనా కథ వినేటప్పుడు మంచి ఫీల్‌తో వింటూంటారు. కానీ ఈ అమ్మడు 'నా నువ్వే'  కథ మాత్రం నిద్రపోతూ విందట.  డైరెక్టర్ అంత పట్టుబట్టి కథ చెప్పకపోతే ఓ మంచి సినిమాను మిస్ అయి ఉండేదాన్ని అంటోంది తమ్మూ డార్లింగ్. ఈ విషయం తెలిసిన టాలీవుడ్ ప్రేక్షకులు తెలుగు సినిమాలు అంటే నీకు నిద్రొస్తోందా అమ్మడూ  అంటూ సెటైర్లు వేస్తున్నారు. 


krish-new-movie
'గమ్యం' సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టి తన మొదటి సినిమాకే ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డ్ పొందాడు క్రిష్. 'వేదం'తో మూవీతో  తనలోని ప్రతిభను ప్రేక్షకులకు చూపించి క్లాస్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు.  'కృష్ణం వందే జగద్గురుం'తో కమర్షియల్ హిట్ అందుకున్నాడు. 'కంచే' మూవీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలయ్యబాబుతో 'గౌతమిపుత్ర శాతకర్ణి ' తీసి టాప్ డైరక్టర్‌లకు పోటిగా నిలిచాడు. ప్రస్తుతం ఝాన్సీ లక్ష్మీ భాయ్‌ జీవిత కథతో 'మణికర్ణిక' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్‌ భామ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తుంది.

ఈ సినిమా తర్వాత క్రిష్‌ ఓ బోల్డ్‌ కథతో సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్లు టాలీవుడ్‌లో వినిపిస్తుంది. కన్నడ రచయిత బైరప్ప రాసిన 'పర్వ' అనే నవలను సినిమాగా రూపొందించేందుకు క్రిష్‌ చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇదే క్రిష్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అని టాలీవుడ్ టాక్.  

మహాభారత గాథకు సంబంధించిన పాత్రల నేపథ్యంలో రాసిన 'పర్వ'లో పలు వివాదాస్పద విషయాలను ప్రస్తావించారు. ఇప్పుడు ఇదే కథతో సినిమా తెరకెక్కిస్తాడా లేదా తెలియాలంటే కొన్ని రోజులు అగాలి మరి.

తెలంగాణలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో వివిధ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలని సూచించింది. 
పోస్టులు: పోస్ట్ గ్రాడ్యుయేట్ కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్ (పీజీసీఆర్‌టీ): 580
స్పెషల్ ఆఫీసర్ (ఎస్‌ఓ): 49
కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్ (సీఆర్‌టీ): 359
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(పీఈటీ): 62
అర్హత: ఇంటర్, డిగ్రీ, పీజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో సర్టిఫికెట్, డిప్లొమా, బీపీఈడీ, టీఎస్ టెట్/ ఏపీ టెట్/ సీటెట్‌లో అర్హత
ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా
ఆన్‌లైన్ దరఖాస్తు: 20.06.2018 నుంచి 23.06.2018 వరకు 
వెబ్‌సైట్: http://ssa.telangana.gov.in/

Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
DailyMirror
Sports
Daily Specials