లిఫ్ట్ ఎక్కకుండా మెట్లెక్కితే మీ గుండె..

Read Time:0 Second

ఫస్ట్ ఫ్లోర్‌కి కూడా లిఫ్ట్ ఎక్కడం.. పది అడుగుల దూరం కూడా నడవలేకపోవడం.. రిమోట్‌కి కూడా ఒకరి మీద ఆధారపడడం.. ఇవన్నీ బద్దకాన్ని సూచిస్తాయి.. దాంతో పాటు గుండె పనితీరుని కూడా దెబ్బతీస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. పిడికెడంత గుండె పనులెన్నో చేస్తుంది. ఆ ఒక్క అవయవమే శరీరంలోని అన్ని అవయవాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. నిమిషమైనా విరామమివ్వకుండా నిరంతరాయంగా పనిచేసే గుండెను కాపాడుకోవడానికి జిమ్‌లో వర్కవుట్లు చేయక్కరలేదు.. డబ్బులేవీ ఖర్చు చేయక్కరలేదు.. ఈ పదీ పాటిస్తే చాలు.. గుప్పెడంత గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇతరత్రా అనారోగ్యసమస్యలేవీ దరి చేరకుండానూ ఉంటాయి.

1. కాలనీలో ఉన్న కూరగాయల మార్కెట్‌కి వెళ్లాలన్నా కారో, బండో తీయకుండా నడిచి వెళ్లి తెచ్చుకుంటే మంచిది. ఆఫీస్‌‌లో ఫస్ట్, సెకండ్ ఫ్లోర్‌లకు లిఫ్ట్ వాడకుండా మెట్లెక్కితే గుండె పనితీరు బావుంటుంది. 2. అన్నీ మీదేసుకుని అనవసరంగా ఒత్తిడికి గురి కావద్దు. అలా చేస్తే గుండెకు ముప్పు ముంచుకువస్తుంది. ఒత్తిడిని తగ్గించుకునే దిశగా రోజూ కనీసం 20 నిమిషాల సేపు ధ్యానం చేయాలి. 3. కార్టిజోల్ వంటి హార్మోన్లు గుండె పని తీరుని దెబ్బతీస్తాయి. వ్యాయామంతో ఇలాంటి హార్మోన్ల స్థాయిలు ఉద్ధృతం కాకుండా చూసుకోవచ్చు. 4. రోజుకి 7-8 గంటల నిద్ర.. గుండె ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుంది. 5. నవ్వు మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తపోటుని తగ్గిస్తుంది. అందువల్ల సమయం దొరికినప్పుడల్లా జోక్స్ చదువుతూ, కామెడీ సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయండి.

6. ఏది పడితే అది తినకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహార పదార్థాలను తీసుకోవడం ఎంతైనా అవసరం. గుండె కూడా ఓ కండరమే కాబట్టి దానికీ తగిన ప్రొటీన్లు అవసరం. చిక్కుళ్లు, బఠానీలు, చేపలతో పాటు బాదం, పిస్తా వంటి వాటిని తీసుకుంటే గుండెకు ప్రొటీన్లు సమృద్ధిగా అందుతాయి. 7. అధిక బరువు కూడా గుండె పని తీరుని దెబ్బతీస్తుంది. బరువు పెరిగితే గుండె మరింత కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఆహార, వ్యాయామాలతో బరువు పెరగకుండా చూసుకోవాలి. 8. జంక్‌ఫుడ్‌, లేట్ నైట్ భోజనం మంచిది కాదు. దీంతో మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ. మధుమేహ వ్యాధి గ్రస్తులను గుండె జబ్బులు త్వరగా పలకరిస్తాయి. అందుకే అలాంటి వాటికి దూరంగా ఉంటే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

9. అప్పుడప్పుడు సరదాగా కుటుంబసభ్యులు, స్నేహితులతో విహార యాత్రలకు వెళ్లండి. దీంతో రొటీన్ లైఫ్‌ నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఇంకా అలా వెళ్లినప్పుడు శరీరానికి కాస్త ఎండ తగులుతుంది. ఎండ ద్వారా వచ్చే డి విటమిన్ గుండెకు మేలు చేస్తుంది. 10. నీరు తగినంతగా తీసుకోవాలి. శరీరంలో నీటి శాతం తగ్గితే రక్తం చిక్కబడుతుంది. దీంతో గుండె రక్తాన్ని అన్ని భాగాలకు సరఫరా చేయడం కష్టంగా మారుతుంది. గుండె మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇది గుండె జబ్బులున్న వారికి మరింత హాని చేస్తుంది. సో.. ఈ పదీ పాటిస్తే.. మీ హృదయం పదిలంగా పది కాలాల పాటు ఉంటుంది.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published.

Close