ఆ కారణంతోనే వైసీపీ గెలిచింది : చంద్రబాబు

తమ్ముళ్లూ.. నేనున్నా భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు చంద్రబాబు. టీడీఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన చంద్రబాబు.. భవిష్యత్‌ పోరాటాలపై నేతలకు దిశానిరిదేశం చేశారు. ప్రజల కోపం టీడీపీ మనం ఓటమి చెందలేదని.. జగన్‌పై ఉన్న సానుభూతి వైసీపీని గెలిపించిందని చెప్పారు. ఒక సీటుతో ప్రస్థానం ప్రారంభించిన టీఆర్‌ఎస్..రెండు సార్లు అధికారంలోకి వచ్చిందని.. ధైర్యం కోల్పోవద్దని చంద్రబాబు నేతలతో అన్నారు.

మరోవైపు….. ఈ సమావేశంలో జగన్‌ ప్రమాణస్వీకారానికి వెళ్లడంపై టీడీపీఎల్పీలో చర్చ జరిగింది. వెళ్లేందుకు చంద్రబాబు సుముఖత వ్యక్తం చేసినా… పార్టీ నేతలు వద్దని వారించారు. పార్టీ తరుపున ఓ బృందాన్ని పంపాలని సూచించారు. రాజ్‌భవన్‌లో అయితే వెళ్లొచ్చని, కానీ బహిరంగ ప్రమాణస్వీకారం కాబట్టి వద్దని నేతలు వారించారు. దీంతో. రేపు పయ్యావుల, అచ్చెన్నాయుడు, గంట శ్రీనివాస్‌రావుతో కూడిన ఓ బృందం…… చంద్రబాబు తరుపున శుభాకాంక్షలు తెలపనుంది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.