ఏపీ ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణం..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని ఇందీరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అశేష జనవాహిని సమక్షంలో అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. దైవసాక్షిగా జగన్‌ ప్రమాణం చేశారు.

నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి జగన్ తల్లి విజయమ్మ, సతీమణి భారతి, సోదరి షర్మిల దంపతులు, జగన్ కుమార్తెలు హాజరయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, తెలంగాణ మంత్రులు, వైసీపీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్‌ నరసింహన్. ఆయన సతీసమేతంగా ఈ కార్యక్రమానికి వచ్చారు. జగన్‌కు అభినందనలు తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్, స్టాలిన్‌లు జగన్‌కు పుష్పగుచ్ఛాలు అందించి కంగ్రాట్స్‌ చెప్పారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.