జగన్‌ ప్రమాణ స్వీకారానికి వరుణుడి టెన్షన్‌!

కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఈదురుగాలులకు విజయవాడ నగరంలో పలు చోట్లు ఫ్లెక్సీలు చిరిగిపోయాయి. వర్షం దాటికి ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారోత్సం చేయబోతున్న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ప్రాంగణం తడిసిముద్దైంది. చెల్లాచెదురుగా ఫ్లెక్సీలు నెలకొరిగాయి.

మరి కొన్ని గంటల్లో సీఎంగా జగన్‌ ప్రమాణ స్వీకారం ఉండడంగా భారీ వర్షం పడడంతో స్టేడియం అంతా బురదమయంగా మారింది. విఐపీ, వివిఐపీ కుర్చీలు తడిసిపోయాయి. గ్రౌండ్‌ ప్రాంగణంలో మెట్లు నీట మునిగాయి. వర్షం పడుతుందనే ముందస్తు ఆలోచన చేయకపోవడంతో సభా ప్రాంగణం దగ్గర కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొంది.

విజయవాడలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. అటు వైసీపీ ఆధ్వర్యంలో కేశినేని భవన్‌ పక్కన ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్స్ కుప్ప కూలింది. అసమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

మరోవైపు రాగల కొన్ని గంటల్లో కృష్ణజిల్లా అంతటా పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఆర్జీఎస్ తెలిపింది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో పెనుగాలులతో కూడిన వర్షం, పిగుగులు పడనున్నాయిని తెలిపింది. ఈప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఆర్టీజీఎస్.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.