సీఎంవో ఉన్నతాధికారులపై బదిలీ వేటు

సిఎంవో కార్యాలయంలో ఉన్న ఉన్నతాధికారులపై బదిలీ వేటు పడింది. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే సిఎంవో ముఖ్య అధికారులను బదిలీ చేశారు. CM ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, CM ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, CM కార్యదర్శి గిరిజా శంకర్, CM కార్యదర్శి అడిసిమల్లి వి జమౌళిపై బదిలీ వేటు పడింది. వెంటనే సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని వారికి ఆదేశాలు అందాయి.
ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిన పనుల్లో నిధులు వ్యయం, బిల్లుల మంజూరుపై స్పష్టతనిస్తూ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మెమో జారీ చేశారు. ఎఫ్ఆర్ బీఎం పరిమితులు పట్టించుకోకుండా మంజూరు చేసిన ఇంజనీరింగ్ పనులతో రాష్ట్ర ఖజానాపై భారం పడేలా చేశాయని మెమోలో సీఎస్ పేర్కొన్నారు. ప్రాధాన్యతలను పట్టించుకోకుండా చేపట్టిన కొన్ని ప్రాజెక్టు పనుల్ని కూడా సమీక్షించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
2019 ఏప్రిల్ ఒకటి కంటే ముందు మంజూరై ఇంకా ప్రారంభించని పనుల్ని రద్దు చేయాలని ప్రభుత్వ శాఖలకు సూచించారు. 25 శాతం కూడా పనులు పూర్తి కాని ప్రాజెక్టుల విషయంలో విలువను తాజాగా నిర్ధారించే వరకు చెల్లింపులు చేయొద్దని సీఎస్ స్పష్టం చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com