కాశీకి వెళ్లిన మోదీ…

modi

వారణాసిలో భారీ విజయం సాధించిన మోదీ.. కాశీ విశ్వనాథ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు.. గెలుపు మొక్కులు చెల్లించుకున్నారు. కాశీకి వెళ్లిన మోదీ వెంటనే అధ్యక్షుడు అమిత్‌ షా, యూపీ సీఎం యోగి కూడా ఉన్నారు. మోదీకి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. పూజారు ప్రత్యేక పూజలు చేసి మోదీని ఆశీర్వదించారు.

ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ప్రత్యేక విమానంలో వారణాసి చేరుకున్న ఆయనకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ రామ్‌నాయక్ ఘనస్వాగతం పలికారు. ఈ నియోజవర్గంలో మోదీ రికార్డు మెజార్టీతో గెలిచారు. దీంతో అక్కడి ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపేందుకు మోదీ వారణాసిలో ప్రస్తుతం పర్యటిస్తున్నారు.

మోదీ వారణాసిలో భారీ రోడ్‌ షోలో పాల్గొనున్నారు. 5 కిలోమీటర్ల భారీ విజయోత్సవ ర్యాలీ జరనుంది. ఈ రోడ్‌ షో కోసం కనీ వినీ ఎరుగని విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ ఫొటోలతో కూడిన బ్యానర్లు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. రోడ్‌ షో ద్వారానే తనను గెలిపించినందుకు అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్నారు. తారువాత నేతలు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published.