అద్భుతం.. ఆ గుడిలో దీపం నీటితో వెలుగుతుంది..

నిప్పుని ఆర్పాలంటే నీళ్లు కావాలి. దీపాన్ని వెలిగించాలంటే నూనె లేదా నెయ్యి కావాలి. కానీ కొన్ని అద్భుతాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఈ కోవెలలోని దేవుడికి నూనెతో పని లేకుండా నీటితో దీపారాధన చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని సాజాపూర్ జిల్లా కాలీసింద్ నది ఒడ్డున ఉన్న గడియాఘాట్ మాతాజీ మందిరంలో ఈ అద్భుతం కనిపిస్తుంది. గత ఐదేళ్ల నుంచి ఈ అఖండ జ్యోతి వెలుగులు పంచుతూనే ఉంది. దేశంలోని చాలా దేవాలయాల్లో ఇలా ఆరకుండా వెలిగే జ్యోతులు ఉన్నా ఇక్కడి ఆలయంలోని జ్యోతి మాత్రం చాలా ప్రత్యేకమైనదని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. ప్రమిదలో నిత్యం నూనెకు బదులు నీటిని పోస్తే చాలు వెలుగుతూనే ఉంటుందన్నారు. ఆలయ పూజారి సిందూ సింగ్ మాట్లాడుతూ.. ఇంతకు ముందు నూనెతోనే దీపారాధన చేసేవారం. కానీ ఒక రోజు అమ్మవారు కలలో కనిపించి నీటితో జ్యోతి వెలిగించమని చెప్పారు. ఆమె ఆదేశాల ప్రకారం ఆరోజు నుంచి అలానే చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి దీపం నిరంతరాయంగా వెలుగుతూనే ఉంది అని తెలిపారు. అయితే తాను నీటితో దీపాన్ని వెలిగిస్తున్నానని చెబితే ఎవరూ నమ్మరని చాలా కాలం ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదన్నారు. ఈ ఆలయం నదీ తీరంలో ఉండడం వలన వర్షాకాలంలో పూర్తిగా నీట మునుగుతుంది. దీంతో వర్షాకాలమంతా ఆలయాన్ని మూసే ఉంచుతారు నిర్వాహకులు. మళ్లీ దసరా నవరాత్రులకు ఆలయాన్ని తెరిచి పూజాదికాలు నిర్వహిస్తారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.