ప్రభుత్వ కీలక నిర్ణయం.. ఒక్క రూపాయికే కిలో రాగులు..

ప్రజా పంపిణీ వ్యవస్థ (రేషన్ షాపులు) ద్వారా కేవలం ఒక్క రూపాయికే కిలో రాగులను ఇవ్వాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పౌష్టికాహారం, పోషక వినియోగమే లక్ష్యంగా పౌరుల అందరి ఆరోగ్యం తమ బాధ్యతగా పని చేస్తోంది ప్రభుత్వం. చీఫ్ సెక్రటరీ ఆదిత్య ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గజపతి, కల్హండి, కందమల్, కోరాపుట్, మల్కన్ గిరి, రాయగడ, నౌపాడ ప్రాంతాల్లో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క వినియోగదారుడికి ఒక్క రూపాయికే కిలో రాగులను పొందవచ్చని తెలిపారు. ఈ అవకాశం జులై నెల నుంచి వినియోగించుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంకా రాష్ట్రంలోని బేకరీ యజమాని దారులు, బిస్కట్స్ తయారు చేసే కంపెనీలు, స్వీట్స్ తయారు చేసేవారు, మెగా రిటైల్ కౌంటర్ల వారితో ఒప్పందాలు కుదుర్చుకుని రాగిని ప్రమోట్ చేయాలని ఆదిత్య సూచించారు. 17 వేల 500 క్వింటాళ్ల రాగిని రేషన్ కార్డు వినియోగదారులకు అందచేస్తామని వ్యవసాయ శాఖ కార్యదర్శి చెప్పారు. ఖరీఫ్ సీజన్‌లో లక్ష క్వింటాళ్ల రాగులను రైతుల నుంచి సేకరిస్తామన్నారు. ఇందుకోసం ప్రతి క్వింటాలుకు రూ.2 వేల 897లు చెల్లిస్తామన్నారు. దీని వల్ల రైతులు రాగులు పండించడానికి ఉత్సాహం చూపుతారన్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.