యోగా ట్రైనర్‌ను వివాహం చేసుకున్న అల్లు అర్జున్ అన్న..

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ పెళ్లి చేసుకున్నారు. అరవింద్‌కి ముగ్గురు కుమారులైనా ఇద్దరు మాత్రమే అభిమానులకు తెలుసు. అయితే బాలూ తండ్రితోనే ఉంటూ నిర్మాణ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. ఇండస్ట్రీలో ఉన్నవారికి బాబీ పరిచయం. బాబీ బయట ఫోకస్ అవడానికి అంతగా ఇష్టపడరు. బాబీకి ఇంతకు ముందే పెళ్లై మొదటి భార్యతో విడిపోయారు. ఆయనకు ఓ కుమార్తె కూడా ఉన్నారు. ముంబైకి చెందిన యోగా ట్రైనర్ నీలూ షా పూణేలోని సింబయాసిస్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసిన ఆమె తన సోదరితో కలిసి యోగా డెస్టినేషన్ పేరిట యోగా శిక్షణ కేంద్రాన్ని నడుపుతున్నారు. ముంబైలో పుట్టిన నీలూ ప్రస్తుతం హైదరాబాద్‌లో సెటిలయ్యారు. వీరిది ప్రేమ వివాహం అని తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బాబీ పెళ్లి ఫోటోల్లో అల్లు అర్జున్ కనిపించలేదు. ఆయన భార్య స్నేహ మాత్రం పెళ్లి వేడుకల్లో ఉన్నారు. బహుశా త్రివిక్రమ్ సినిమాలో బిజీగా ఉన్న బన్నీ అన్న వివాహ వేడుకలకు హాజరుకాలేకపోయి ఉండవచ్చని భావిస్తున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.