ప్రభుత్వ పాఠశాలను కాపాడాలని ఆ గ్రామస్తులు...

ప్రభుత్వ పాఠశాలను కాపాడాలని ఆ గ్రామస్తులు...

అది ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. తల్లిదండ్రుల ఇంగ్లిష్‌ మీడియం మోజులో దాదాపు మూతపడే స్థితికి చేరింది. ఏటా తగ్గిపోతున్న పిల్లలతో స్కూల్‌ పరిస్థితి గ్రామ యువతను కదిలించింది. కట్‌ చేస్తే... ఇప్పుడు ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా నిలబడింది. ఇంతకీ అక్కడ ఏం జరిగింది..?

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఇది. చుట్టు పక్కల మరో స్కూల్‌లేదు. ఇంగ్లిష్‌ మీడియం చదువుల కోసం పిల్లల్ని బస్సుల్లో దూర ప్రాంతాలకు పంపడం మొదలు పెట్టారు. దీంతో మూడేళ్ల క్రితం స్కూల్‌ విద్యార్థుల సంఖ్య 18కి పడిపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే స్కూల్‌ త్వరలోనే మూతపడుతుందని గ్రామ యువత గమనించారు. వాళ్లంతా ఓ కమిటీగా ఏర్పడి స్కూల్‌ అభ్యున్నతికి నడుం బిగించారు. ఇంగ్లిష్‌ మీడియం లేకపోవడంవల్లే పేరెంట్స్‌ పట్టించుకోవడంలేదని నిర్ధారణకు వచ్చారు. పరిష్కారంగా చందాలు వేసుకుని మరీ ప్రయివేటు టీచర్‌ను ఏర్పాటు చేశారు. ఊళ్లోనే ఇంగ్లిష్‌ మీడియం ఏర్పాటుకావడంతో తల్లిదండ్రులు కూడా ఇక్కడ పిల్లల్ని చేర్చడం మొదలు పెట్టారు.

గ్రామ యువత, తల్లిదండ్రుల పట్టుదల చూసి అప్పటి నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం సొంత డబ్బుతో కేరళ నుంచి టీచర్లను తెప్పించారు. ప్రయివేటు స్కూళ్లవారు తమ గ్రామంలోకి ప్రచారానికి రాకుండా పంచాయితీలో తీర్మానం చేశారు. ఈ నిర్ణయంతో పాఠశాల విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరిగింది. అలా 18 మంది నుంచి విద్యార్థుల సంఖ్య

వట్టిమర్తి ప్రాథమిక పాఠశాల గత రెండేళ్లుగా అధిక ఉత్తీర్ణత సాధిస్తూ ఇతర సర్కారీ స్కూళ్లకు ఆదర్శంగా నిలుస్తోంది. గత గురుకుల ఎంట్రన్స్‌ పరీక్షల్లో ఇక్కడి నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపికవడం విశేషం. అన్ని ప్రభుత్వ స్కూళ్ల మాదిరిగానే ఇక్కడ కూడా టీచర్ల కొరత వేధిస్తోంది. మరికొందరు టీచర్లను నియమించాలని గ్రామస్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story