ఏపీలో వైసీపీకి కౌంట్‌డౌన్‌ మొదలైంది – చంద్రబాబు

ఏపీలో వైసీపీకి కౌంట్‌డౌన్‌ మొదలైందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. కుప్పంలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ తీసుకుంటున్న నిర్ణయాలు.. ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్నాయన్నారు. తాను కాస్త జాగ్రత పడి ఉంటే బాగుండేదని.. అయితే కొంతమంది గెలుపుపై అతి విశ్వాసం ప్రదర్శించారన్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు.

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వాఖ్యలు చేశారు. కార్యకర్తలకు స్పూర్తి నింపడంలో ఫెయిలయ్యామన్నారు. అదే సమయంలో ప్రజలను మేనేజ్‌ చేయడంలోనూ విఫలమయ్యామన్నారు చంద్రబాబు. తాను కూడా జాగ్రత్త పడి ఉంటే బాగుండేదని.. అయితే కొంతమంది నేతలు గెలుపుపై ఓవర్‌ కాన్ఫడెన్స్‌ ప్రదర్శించారన్నారు చంద్రబాబు. అయితే రాష్ట్రంలో వైసీపీకి కౌంట్‌డౌన్‌ మొదలైయిందన్నారు చంద్రబాబు. ఆ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్ని చైతన్యం చేస్తున్నాయన్నారు. పించన్లు, విత్తనాలు, విద్యుత్‌ను సమయానికి ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. అంతకుముందు.. సొంత నియోజకవర్గం కుప్పంలో రోడ్‌షో నిర్వహించారు చంద్రబాబు నాయుడు. అభిమానులు అడుగుడుగనా నీరాజనం పలికారు. కుప్పం పసుపు సంద్రంగా మారింది.

పార్టీ అధికారంలో లేనంత మాత్రాన ఎవరూ అధైర్యపడొద్దన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవన్నారు. 183 మంది టీడీపీ కార్యకర్తలపై భౌతిక దాడులు జరిగాయన్నారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశానన్నారు చంద్రబాబు. ప్రాణం ఉన్నంతవరకు కుప్పం ప్రజలకు సేవ చేస్తానన్నారు చంద్రబాబు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.