ఘోర రోడ్డు ప్రమాదం.. 29 మంది దుర్మరణం

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లక్నో నుంచి ఢిల్లీకి వస్తున్న ఓ బస్సు… ఆగ్రా వద్ద ఇవాళ ఉదయం డ్రైనేజీ కాల్వలో పడింది. ఈ ప్రమాదంలో 29 మంది ప్రయాణికులు మరణించారు. యూపీ రోడ్‌వేస్‌కు చెందిన స్లీపర్ కోచ్ ప్యాసింజర్ బస్సు యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై వేగంగా వస్తూ 15 అడుగుల లోతున్న డ్రైనేజీ కాల్వలో పడిపోయింది. ఈ ఘటనలో 29 మంది ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోగా.. మరో మరో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన వారిని మురుగు కాల్వ నుంచి బయటికి తీసి…. ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదంలో క్షతగాత్రులకు సత్వర వైద్యం అందించాలని సీఎం జిల్లా కలెక్టరును ఆదేశించారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.